హోమ్ /వార్తలు /క్రైమ్ /

భర్త పనికి వెళ్తుండగా అడ్డుకున్న భార్య.. కాసపేటికే ఇద్దరు శవాలయ్యారు.. పిల్లలు అనాథలయ్యారు..

భర్త పనికి వెళ్తుండగా అడ్డుకున్న భార్య.. కాసపేటికే ఇద్దరు శవాలయ్యారు.. పిల్లలు అనాథలయ్యారు..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

భార్యా భర్తలు చిన్న కారణానికే గొడవపడ్డారు. మాటా మాటా పెరగడంతో.. భార్యను కత్తితో పొడిచాడు భర్త. ఆ తర్వాత తానూ పొడుచుకున్నాడు. చివరకు ఇద్దరూ మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.

భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణమే. కొన్ని జంటలు వీటిని లైట్ తీసుకుంటాయి. ఏదైనా గొడవ జరిగితే.. కాసేపటికే మర్చిపోయి మళ్లీ కలిసిపోతారు. మరికొందరు మాత్రం చిన్న దాన్నే పెద్దది చేసి.. కాపురాలను కూల్చుకుంటారు. ఇంకొందరు దంపతులైతే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలకే చంపుకోవడం..చనిపోవడం చేస్తుంటారు. తాజాగా యూపీలోని సోన్‌భద్రలో ఇలాంటి ఘటనే జరిగింది. భర్త పనికి వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. అది పెద్దదై చంపుకునే వరకు వెళ్లింది. క్షణికావేశంలో అతడు తన భార్యను పొడిచి.. ఆపై తానూ పొడుచుకున్నాడు. చివరకు వీరిద్దరు పిల్లలను అనాథలను చేసి చనిపోయారు.

అయ్యయ్యో..గుడిలో ఉరికి వేలాడుతూ కనిపించినప్రేమ జంట!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోన్‌భద్ర జిల్లా కోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైరల్ గ్రామానికి చెందిన సర్దార్ అలియాస్ శార్దా చెరో, పుల్వాదేవి భార్య భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి పేర్లు లాలా అలియాస్ నితీష్ (13 ), శివమ్ (7 ), రికు (13 ). శార్దా చెరో ఒడిశాలో పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్యే సొంతూరికి వచ్చాడు. మళ్లీ పని కోస ఒడిశా వెళ్లాల్సి ఉంది. అందుకోసం రిటర్న్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాడు. ఐతే ఒడిశాకు వెళ్లాల్సిన అవసరం లేదని భార్య అడ్డుకుంది. తనకు జ్వరంగా ఉందని.. ఇక్కడే ఉండాలని కోరింది. కానీ భర్త వినలేదు. ఈ విషయమై ఇంట్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది. పెళ్లలు వేరొక గదిలో ఉన్న సమయంలో ఇద్దరూ తిట్టుకున్నారు. మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలోనే శార్దా చెరో రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న సీసాను పగులగొట్టి.. దానితో భార్యను పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిపోయాడు. అనంతరం తానూ పొడుచుకున్నాడు.

Shocking : పాపం..నోటితో బాటిల్ మూత ఓపెన్..బాలుడు మృతి

వారి అరుపులు కేకలు వినపడడంతో పిల్లలు లోపలికి వెళ్లి చూశారు. తల్లిదండ్రులిద్దరు రక్తపు మడుగులో పడి ఉండడంతో బిగ్గరగా ఏడ్చారు. వారి ఏడుపులను విని చుట్టుపక్కల వారు వచ్చారు. అనంతరం డయల్ 112కి ఫోన్ కాల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మొదట ఓ చిన్న ఆస్పత్రికి తరలించారు. ఐతే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో... మెరుగైన ఆరోగ్య చికిత్స కోసం చోపాన్ సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భార్యాభర్తలిద్దరు మరణించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సోన్‌భద్ర ఎస్పీ అమరేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు. భర్త పనికి వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అన్నారు. ఏదేమైనా క్షణికావేశంలో చేసిన ఈ పనితో వారి పిల్లలు మాత్రం అనాథలయ్యారు. వారి పరిస్థితిని చూసి స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు.

First published:

Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు