నడిరోడ్డుపై కుటుంబం ప్రాణాలు కాపాడిన పోలీసులు...సెన్సేషన్‌గా మారిన వీడియో...

యూపీ పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేసి ఒక కుటుంబాన్ని నడిరోడ్డుపై కాపాడిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. నిప్పులు విరజిమ్ముకుంటూ పేలిపోయేందుకు సిద్ధంగా ఉన్న బైక్ ప్రయాణిస్తున్న కుటుంబాన్ని కాపాడి యూపీ పోలీసులు నెటిజన్ల మనస్సు దోచుకున్నారు.

news18-telugu
Updated: April 15, 2019, 6:11 PM IST
నడిరోడ్డుపై కుటుంబం ప్రాణాలు కాపాడిన పోలీసులు...సెన్సేషన్‌గా మారిన వీడియో...
మంటల్లో బైక్ (image : twitter)
  • Share this:
యూపీ పోలీసుల సమయస్ఫూర్తి ఒక కుటుంబం నిండు ప్రాణాలు నిలిపింది. ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్యాట్రోలింగ్ చేస్తున్న యూపీ పోలీసులకు వేగంగా మంటలు విరజిమ్ముతూ దూసుకెళ్తున్న ఒక బైక్ కనిపించింది. బైక్ పై దంపతులు అలాగే వారి కుమారుడు ఉన్నారు. అయితే బైక్ కింది భాగంలో మంటలు చెలరేగడంతో వారు గుర్తించకుండా అలాగే వెళ్తున్నారు. దూరం నుంచే ప్రమాదం పసిగట్టిన ప్యాట్రోలింగ్ పోలీసులు, వారిని పోలీసు జీపులో చేజ్ చేశారు. బైక్ వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయని, బైకర్ ను హెచ్చరిస్తూ వారి బండిని ఆపారు, అంతేకాదు పోలీసులు వెంటనే దంపతులను వారి కుమారుడిని మంటల్లో కాలిపోతున్న బైక్ నుంచి దూరంగా తీసుకెళ్లి కాపాడారు. దీంతో గండం గట్టెక్కింది. అయితే ఈ మొత్తం ఘటనను సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసి యూపీ పోలీసులు ట్విట్టర్ లో పెట్టారు. దీంతో పోలీసులు తీసుకున్న చొరవపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు యూపీ డీజీపీ సైతం పోలీసుల సాహసాన్ని కొనియాడుతూ ట్వీట్ చేయడం విశేషం.


వీరోచితంగా ప్రమాదపు అంచుల్లో ఉన్న కుటుంబాన్ని కాపాడిన యూపీ పోలీసులు..First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు