ఇక దబిడి దిబిడే..సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.10వేల జరిమానా

రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: August 1, 2020, 12:55 PM IST
ఇక దబిడి దిబిడే..సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.10వేల జరిమానా
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ యోగీ సర్కారు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్‌ చేసినా, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోయినా వాహన చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్‌ మాట్లాడటం కూడా రూ.10వేల జరిమానా పరిధిలోకి చేర్చింది యూపీ ప్రభుత్వం. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే రూ.1000లు, రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే రూ.10 వేల జరిమానా విధిస్తారు. రోడ్డు భద్రతను పెంచేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని యూపీ అధికారులు చెబుతున్నారు. జరిమానా భారీగా ఉంటేనే ట్రాఫిక్ నిబంధనలను వాహన చోదకులు పాటిస్తారని పేర్కొంటున్నారు.

అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినా...సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారును నడిపినా ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానాను రెండింతలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఇకపై రూ.500, సీటు బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ.1000, పార్కింగ్ నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి రూ.500, రెండోసారి రూ.1500..లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5000, స్పీడ్ లిమిట్‌ను అతిక్రమిస్తే రూ.4000, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. వాహనాల డిజైనింగ్‌లో అక్రమంగా మార్పులు చేసి విక్రయిస్తే రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు యూపీ ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది.
Published by: Janardhan V
First published: August 1, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading