UP MAN THRASHES WIFE FOR VOTING AGAINST HIS CHOICE WOMENS PANEL SEEKS ACTION PAH
Uttar Pradesh: నాకు నచ్చని వారికి ఓటు వేశావు.. భార్యను చితక్కొట్టిన భర్త .. ఆ తర్వాత..
ప్రతీకాత్మక చిత్రం
Shocking: ఉత్తర ప్రదేశ్ లో కట్టుకున్న భర్త, భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తాను చెప్పిన రాజకీయ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేశావని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా..
Assembly elections: సాధారణంగా వ్యక్తికి ఓటుహక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోరాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్చగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. కొందరు డబ్బుల కోసం ఆశపడి తమ అమూల్య మైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారు. బాబా సాహేబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలిపారు.
ఒక్క ఓటుతో ప్రజలు.. వ్యవస్థలను మార్చే అవకాశం కల్పించారు. కొందరు రాజకీయ పార్టీలు .. ఎన్నికలు రాగానే డబ్బులు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దీన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Husband Brutally Attack On Wife: ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మరోసారి అధికారంలో వచ్చింది. ఒక స్థానంలో ఆప్ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే, యూపీలోని (Uttar Pradesh) రాయ్ బరేలీలో ఒక దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన కట్టుకున్న భార్య పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. తాను చెప్పిన వ్యక్తిని కాదని వేరే వ్యక్తికి ఓటు వేశావంటూ భార్యను నోటికోచ్చినట్లు తిట్టాడు. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. తర్వాత ఆమెను కొట్టాడు. ఇంటి నుంచి కూడా తరిమేశాడు. అంతటితో ఆగకుండా నీకు విడాకులు ఇస్తానంటూ కూడా బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై ఇప్పటికే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అతడికి నచ్చ చేప్పడానికి ప్రయత్నించారు.
ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ఇది చివరకు జాతీయ మహిళ కమిషన్ వరకు వెళ్లింది. దీనిపై జాతీయ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొవాలని యూపీ డీజీపీకి లేఖను రాశారు. అదే విధంగా, సంఘటనపై వారం రోజుల్లో పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. నిందితుడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.