హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: కూల్ డ్రింక్ ఇచ్చి టీచర్ పై అఘాయిత్యం.. కారణం ఏంటంటే..

Shocking: కూల్ డ్రింక్ ఇచ్చి టీచర్ పై అఘాయిత్యం.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: టీచర్ ను తన బైక్ మీద డ్రాప్ చేస్తానని చెప్పాడు. తెలిసిన వాడే కదా అని అంగీకరించింది. ఆ తర్వాత.. కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చాడు.

మహిళలు, అమ్మాయిలపై వేధింపుల (Woman harassment) ఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం మార్పులు రావడం లేదు. బడి, గుడి, బస్టాండ్, ఇల్లు, ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  దారుణం చోటు చేసుకుంది. షాజహన్ పూర్ కు చెందిన 28 ఏళ్ల అమిర్ అనే వ్యక్తి స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ ను ప్రేమ (love)  పేరుతో వేధిస్తుండే వాడు. ఒకటే గ్రామానికి చెందిన వారు కావడంతో పలు మార్లు హెచ్చరించింది. ఈ క్రమంలో గత మే 4 న టీచర్ ను బైక్ పైన ఎక్కాలని అమిర్ కోరాడు. తెలిసిన వాడే కదా.. అని ఆమె ఎక్కింది.

ఆ తర్వాత కూల్ డ్రింక్ (Cool drink) ఇచ్చాడు. అది తాగగానే ఆమె మత్తులోనికి జారుకుంది. అతను ఇంట్లో తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత... మతం మారి పెళ్లి చేసుకొవాలని బెదిరింపులకు దిగాడు. అత్యాచారం (Rape) చేసిన వీడియో వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితుని తల్లి, సోదరి, సోదరుడు, సమీప బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను ఆస్పత్రికి తరలించారు.

రాజస్థాన్ లో (Rajasthan)  అమానుషం చోటు చేసుకుంది.

12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl)  పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.

First published:

Tags: Female harassment, Harassment, Rape on women, Uttar pradesh

ఉత్తమ కథలు