Home /News /crime /

UP MAN FOUND IN TEMPLE WITH THROAT SLIT WAS KILLED BY COUSIN PAH

పక్కా ప్లాన్.. దేవాలయంలో అమానుషం.. నిద్రలో ఉండగా దగ్గరి బంధువులే...

ఘటనపై వివరాలు చెబుతున్న అధికారులు

ఘటనపై వివరాలు చెబుతున్న అధికారులు

Uttar pradesh: వ్యక్తి రోజు స్థానికంగా ఉన్న ఒక ఆలయంలో పడుకునే వాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సమీప బంధువులతో గొడవ జరిగింది. దీంతో వారు అదును కోసం చూస్తున్నారు.

కొంత మంది గ్రామాల్లో పగలు, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. పగవాడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అంటూ.. అదును కోసం చూస్తుంటారు. కొన్ని సార్లు.. ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇప్పటికి మనం తరచుగా కత్తులతో ఇరువర్గాలు దాడులు చేసుకుని, చంపుకుంటున్న ఘటనలు చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  దారుణ ఘటన జరిగింది. అమేథి జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. భూపూర్ అనే గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో పంకజ్ శుక్లా అనే (35)ఏళ్ల  వ్యక్తి ప్రతిరోజు పడుకుంటు ఉంటేవాడు. అయితే, కొన్ని రోజుల క్రితం ఇతని సమీప బంధువైన గుల్లు మిశ్రా ల మధ్య గొడవ జరిగింది. దీంతో వారు వాగ్వాదం చేసుకున్నారు. ఈ క్రమంలో.. గుల్లు మిశ్రా అతనిపై కోపం పెంచుకున్నాడు. దాడి చేయడానికి స్కెచ్ ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా హనుమాన్ ఆలయంలో సింగిల్ గా పడుకుంటున్నాడని తెలుసుకున్నాడు.

వెంటనే కత్తులు, గొడ్డలితో వెళ్లి అతనిపై దాడిచేసి (brutally murder)  చంపారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం పూట ఆలయంలోకి వెళ్లేసరికి, పంకజ్ శుక్లా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గాలించి అరెస్టు చేశారు. అదుపులోనికి నిందితుడిపై విచారణ చేపట్టారు. గతంలో సంభవించిన గొడవల ప్రతీకారం వలన హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.ఇదిలా ఉండగా నిండు గర్భిణిపై కొందరు దుండగులు దాడి చేశారు.

వారిలో దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ.. ఆస్పత్రి పాలయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయగా.. అప్పటికే నవజాత శిశువు మరణిచింది. వారు కొట్టడం వల్లే.. ఇలా జరిగిందని.. కేసు పెట్టాలని ఆమె భర్త పోలీసులను ఆశ్రయిస్తే.. వారు పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్ కోసం చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించడంతో .. అతడు తన నవజాత కుమార్తె మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించాడు. స్థానికుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. లక్నోకు చెందిన ధనిరామ్, నీతా భార్యభర్తలు. ధనిరామ్ భార్య గర్భవతి. ఆరు నెలల గర్భంతో ఉన్న ఆమెను ఇద్దరు వ్యక్తులు కొట్టారు. ఆ తర్వాత ఆమె తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

ధనిరామ్ తన భార్యను సమీపంలోని నర్సింగ్ హోమ్‌కు తరలించాడు. అక్కడ ఒక వైద్యుడు ఆమెకు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేశాదు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మినిచ్చింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే పాప మృతి చెందింది. ఈ క్రమంలో తన భార్యపై దాడి చేపిన గుడ్డు, రామస్వంపై ఫిర్యాదు చేసేందుకు ధనిరామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతని ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు నిరాకరించారు. అనంతరం స్థానికులతో కలిసి తన నవజాత కుమార్తె మృతదేహంతో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ చౌదరి ధనిరామ్‌కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Burtally murder, Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు