34 ఏళ్ల యువకుడు.. పెళ్లి కోసం ఎన్నో ప్రయత్నాలు.. చివరకు పేదింటి యువతికి ఎదురుకట్నం.. పెళ్లయిన ఐదు గంటల్లోనే..

ప్రతీకాత్మక చిత్రం

34 ఏళ్ల ఓ వ్యక్తికి ఎంతో కాలంగా పెళ్లి కావడం లేదు. పెళ్లి కోసం అతడు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాడు. చివరకు ఓపిక నశించి పెళ్లంటేనే అతడికి విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. దీంతో..

 • Share this:
  అతడికి 34 ఏళ్ల వయసు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎంతకూ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పెళ్లి చూపులకు వెళ్లడం, అమ్మాయి తరపు వాళ్లు నో చెప్పడం అతడి జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. చివరకు అతడికి పెళ్లిచూపులంటేనే విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. అయితే అతడి వదిన ఓ సలహా ఇచ్చింది. కట్నం ఇవ్వలేని పేదింటి అమ్మాయి కోసం కనుక వెతికితే పెళ్లి పని సులభం అవుతుందనీ, పెళ్లి కూడా తప్పకుండా జరిగి తీరుతుందని అతడికి నచ్చజెప్పింది. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఎట్టకేలకు ఓ అమ్మాయి దొరికింది. మొత్తానికి పెళ్లి చేసుకోవాలన్న అతగాడి చిరకాల కోరిక కూడా తీరింది. అయితే పెళ్లయిన ఐదు గంటల్లోనే ఆ నవ వధువు అతడికి కోలుకోలేని షాకిచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజాన్పూర్ జిల్లా పోవయాన్ పరిధిలోని ఓ గ్రామంలో 34 ఏళ్ల ఓ వ్యక్తికి ఎంతో కాలంగా పెళ్లి కావడం లేదు. పెళ్లి కోసం అతడు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూశాడు. చివరకు ఓపిక నశించి పెళ్లంటేనే అతడికి విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. అతడి పరిస్థితిని గమనించిన వదిన ఓ సలహా ఇచ్చింది. పెద్దగా కట్న కానుకలను ఆశించకుండా, కట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్న పేదింటి అమ్మాయిల కోసం ప్రయత్నిస్తే పెళ్లి కోరిక తీరుతుందని చెప్పింది. ఆమె చెప్పిన సలహా నచ్చడంతో అతడు ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి ఫరుఖ్ బాద్ లోని ఓ పేదింటి యువతి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పింది. వాళ్ల కోరిక మేరకు పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.30 వేల రూపాలయను కూడా అతడు ఇచ్చేశాడు.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  ఫరుఖ్ బాద్ లోనే ఓ గుడిలో శనివారం వారి పెళ్లి జరిగింది. ఎట్టకేలకు అతడి కల నెరవేరింది. అయితే పెళ్లయిన ఐదు గంటల తర్వాత పెళ్లి కూతురు కనిపించలేదు. ఏమయిపోయిందా? అని చుట్టుపక్కల వెతికారు. పెళ్లికూతురే కాదు, ఆమె వెంట వచ్చిన ముగ్గురు నలుగురు బంధువులు కూడా కనిపించకుండా పోయారు. పెళ్లి కోసం విలువైన నగలను కొని తనకు కాబోయే భార్యే కదా అని ఆమెకు ఇచ్చాడా పెళ్లికొడుకు. ఆ నగలతోపాటు వరుడికి చెందిన డబ్బుతో ఆ వధువు అదృశ్యమయిందని వారు గ్రహించారు. దీంతో వాళ్లు ఉండే ఇంటికి వెళ్తే, అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. దీంతో ఆ వరుడు ఆదివారం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. డబ్బు, నగల కోసమే పెళ్లి నాటకం ఆడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: