హోమ్ /వార్తలు /క్రైమ్ /

Naredra giri Maharaj: నరేంద్ర గిరి కేసుపై యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కేసు విచారణకు రంగంలోకి దిగిన ఆ సంస్థ

Naredra giri Maharaj: నరేంద్ర గిరి కేసుపై యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కేసు విచారణకు రంగంలోకి దిగిన ఆ సంస్థ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నరేంద్ర గిరి మహరాజ్​ (Narendra giri maharaj) మృతిపై దర్యాప్తును సీబీఐ (Central Bureau of investigation)కి అప్పగించారు. ఈ మేరకు కేసును సీబీఐ (CBI) తన ఆధీనంలోకి తీసుకుంది. మహంత్ మృతి కేసు దర్యాప్తునకు కేంద్రం ఆమోదం తెలపడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.

ఇంకా చదవండి ...

  అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్​ (Narendra giri Maharaj) మృతిపై దర్యాప్తును సీబీఐ (Central Bureau of investigation)కి అప్పగించారు. ఈ మేరకు కేసును సీబీఐ (CBI) తన ఆధీనంలోకి తీసుకుంది. మహంత్ మృతి కేసు దర్యాప్తునకు కేంద్రం ఆమోదం తెలపడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government)) సిఫారసు చేసిన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆప్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్‌ (FIR)ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

  శిష్యులపైనే అభియోగాలు..

  తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరితో పాటు మరో ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కారణమని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌ (suicide note)లో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఘటనపై పలువురు సాధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు దర్యాప్తున (Investigation)కు యూపీ (UP) ప్రభుత్వం తొలుత సిట్‌ (SIT) ఏర్పాటు చేసింది. కానీ, మరింత లోతైన దర్యాప్తు కోసం సీబీఐ (CBI)కి బాధ్యతలను అప్పగించింది. నరేంద్ర గిరి మరణంపై పలు ఆధారాలను సేకరించామని, కుట్రదారులు తప్పించుకోలేరని సీఎం యోగి (Yogi) పేర్కొన్నారు. ఈ మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు యూపీ హోంశాఖ ట్విటర్​లో తెలిపింది.

  అసలేం జరిగింది..

  దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడా పరిషత్ ( All India Akhada Parishad) అధ్యక్షుడు, ప్రముఖ స్వామీజీ, మహంత్ నరేంద్ర గిరి (Narendra giri) స్వామీ సెప్టెంబర్​ 20వ తేదీన ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని (hanging) ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 5 పేజీల సూసైడ్ నోట్‌ (suicide note)ను కూడా రాశారు స్వామీజీ . తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి (Anand giri) ఇందుకు బాధ్యుడుగా నరేంద్ర గిరి అందులో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృదం (forensic team)తో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. మానసిక సమస్యలతో పాటు శిష్యుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ లెటర్‌లో రాశారు నరేంద్రగిరి. తాను మరణించిన తర్వాత ఆశ్రమాన్ని ఎలా నడిపించాలో నరేంద్ర గిరి స్వామీజీ అందులో పేర్కొన్నారు.

  ఆ తీర్మానాలేనా?

  ప్రఖ్యాత నగరాల్లో ఉన్న ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదంటూ ఆయన ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. రామజన్మభూమి పాలక మండలిలో తమ అఖాడా పరిషత్ ప్రతినిధులను కూడా తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ విస్తృతంగా కొనసాగుతోన్న నేపథ్యంలోనే- మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాను ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నానని, తన తదనంతరం అఖాడా పరిషత్ బాధ్యతలను ఆనంద్ గిరి అప్పగించాలంటూ సూచించారు. మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, దీని వెనుక కుట్ర ఉందంటూ అఖాడా పరిషత్ అనుమానం వ్యక్తంచేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CBI, Crime, Telugu news, Uttar pradesh, Yogi adityanath