మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దాడులకు సంబంధించిన ఘటనలు ప్రతీరోజు వార్తలలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం దిశ, నిర్భయ వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం మార్పులు రావడంలేదు. గుడి, బడి, బస్టాండ్, ఆఫీస్ ఇలా ప్రతి చోట మహిళలు (Harassment On woman) వేధింపులకు గురౌతున్నారు. ఇక కామాంధులు.. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నే.. తమ వారిపై అఘాయిత్యాలకు (Rape on woman) పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల స్నేహితులు, ఆఫీసులలో యువతులు వేధింపులకు గురౌతున్నారు. కొందరు పెళ్లైన వారిని కూడా వదలడం లేదు. ఇక.. కొంత మంది అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను వేధిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) అమానుషం చోటు చేసుకుంది. లలిత్ పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత నెల ఏప్రిల్ 22 న 13 ఏళ్ల బాలికను కొందరు ప్రలోభ పెట్టి భోపాల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించారు. నలుగురు కలసి నాలుగు రోజుల పాటు (Rape on girl) అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆమె ఇంటి దగ్గర వదిలేసి నిందితులు పారిపోయారు. అప్పటికే తమ కూతురి ఆచూకీ కోసం వారు వెతుకుతున్నారు.
In UP's Lalitpur, a minor girl was allegedly gang-raped by four men. When she approached the local police, she was allegedly raped by the SHO. FIR registered against 6 named accused. SHO suspended, on the run: Nikhil Pathak, Lalitpur SP pic.twitter.com/It3Lrlbk95
— Piyush Rai (@Benarasiyaa) May 3, 2022
బాధితురాలు జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే, స్టేషన్ అధికారి తిలకధారి ఆమెపై కన్నేశాడు. రెండోరోజు ఆమెను స్టేట్ మెంట్ రికార్డు చేయాలని స్టేషన్ కు రప్పించాడు. ఆమె అత్త ముందే.. ఆమెను సెల్ లోనికి తీసుకెళ్లి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు షాకింగ్ కు గురయ్యింది. ఆ తర్వాత... వారు ఉన్నతాధికారులకు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
వెంటనే స్టేషన్ హౌస్ అధికారిని తిలక్ ధారిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి అధికారులు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఇప్పటికే రేప్ చేసిన నలుగురు నిందితులలో ఒకరిని లలిత్ పూరి ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang rape, Man harassed, Minor girl raped, Uttar pradesh