హోమ్ /వార్తలు /క్రైమ్ /

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్

ప్రొఫెసర్ సుశీల్ సింగ్, భార్య చంద్రప్రభ (పాత ఫొటోలు)

ప్రొఫెసర్ సుశీల్ సింగ్, భార్య చంద్రప్రభ (పాత ఫొటోలు)

‘కరోనాతో చనిపోతున్నవారి శవాలను లెక్కించలేక విసిగిపోయాను. ఈ ఒమిక్రాన్ కాటుకు అందరూ బలి కాక తప్పదు. అందుకే ముందస్తుగా నా కుటుంబానికి విముక్తి కల్పిస్తున్నాను..’అని సోదరుడికి పంపిన మెసేజ్ లో ప్రొఫెసర్ పేర్కొన్నాడు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే భయంతో కన్పూర్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తన కుటుంబాన్ని అత్యంత దారుణంగా హతమార్చాడు.

ఇంకా చదవండి ...

లక్షల మందిని బలి తీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా మరణాలు నమోదుకాకున్నా, వ్యాప్తి పెరిగితే పరిస్థితి ఆందోళనకరంగా మారొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. భారత్ లో నమోదైన తొలి వేరియంట్ పేషెంట్ నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకుని విదేశాలకు వెళ్లిపోగా, సౌతాఫ్రికా నుంచి తిరిగొచ్చిన 10 మంది ప్రయాణికులు జాడతెలియకుండా జారుకున్నారు. మరోవైపు ఢిల్లీలో కొత్తగా 12, ముంబైలో 14 అనుమానిత ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటన్నిటికంటే షాకింగ్ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే భయంతో కన్పూర్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తన కుటుంబాన్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. ‘ఇంకా మృతదేహాలను లెక్కించే ఓపిక లేదు. ఒమిక్రాన్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందుకే నా కుటుంబానికి విముక్తి ప్రసాదించాను..’అంటూ తన సోదరుడికి వాట్సాప్ మెసేజ్ పెట్టిమరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రొఫెసర్. దీనిపై కాన్పూర్ పోలీసులు చెప్పిన వివరాలివి..

కాన్పూర్ సిటీలోని కల్యాణ్ పూర్ ఏరియాలో నివసించే సుశీల్ సింగ్ వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతనికి చంద్రప్రభ భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తన కుటుంబానికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకిందనే భయంతో ఆ ప్రొఫెసర్ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను గొతు నులిమి చంపేసి, మైనర్లయిన కూతురు, కొడుకులపై సుత్తితో దాడి చేసి, వారి పుర్రెలను పగలగొట్టి చంపేశాడు. కుటుంబీకులను హత్య చేసిన ఆ ప్రొఫెసర్.. తాను ఎందుకలా చేశాడో సోదరుడికి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి పరారయ్యాడు. సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు..

Omicron : షాకింగ్ : పారిపోయిన భారత్ తొలి ఒమిక్రాన్ పేషెంట్ -మరో 10 మంది సౌతాఫ్రికా ప్రయాణికులు గల్లంతు..‘కరోనాతో చనిపోతున్నవారి శవాలను లెక్కించలేక విసిగిపోయాను. ఈ ఒమిక్రాన్ కాటుకు అందరూ బలి కాక తప్పదు. అందుకే ముందస్తుగా నా కుటుంబానికి విముక్తి కల్పిస్తున్నాను..’అని సోదరుడికి పంపిన మెసేజ్ లో ప్రొఫెసర్ పేర్కొన్నాడు. కాగా, అతను చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని, దాని కోసం మందులు కూడా వాడుతున్నాడని కుటుంబీకుల ద్వారా తెలిసింది. డిప్రెషన్ లో ఏం చేస్తున్నాడో అర్థంకాని స్థితిలో గతంలోనూ ఓసారి భార్యపై హత్యాయత్నం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Siddipet : పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి.. కన్నతండ్రి క్రూరత్వం.. భార్యపై అనుమానంతో ఇలా..ఒమిక్రాన్ భయం సాకుతో భార్యా పిల్లల్ని చంపేసి, పారిపోయిన ప్రొఫెసర్ జాడ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కాన్పూర్ పోలీసులు చెప్పారు. ఆ కుటుంబానికి నిజంగానే ఒమిక్రాన్ సోకిందా, లేక ప్రొఫెసర్ డిప్రెషన్ లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త రకం వేరియంట్ ఇప్పటికే 34 దేశాలకు వ్యాపించింది. దీంతో సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల వద్ద నిఘా పెంచారు.

First published:

Tags: Crime news, Omicron, Omicron corona variant, Uttar pradesh

ఉత్తమ కథలు