హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇలాంటి అన్న ఉన్నా ఒక్కటే.. చచ్చినా ఒక్కటే.. కూతురి కోసం కొడుకు గొంతుకోసి చంపిన తండ్రి

ఇలాంటి అన్న ఉన్నా ఒక్కటే.. చచ్చినా ఒక్కటే.. కూతురి కోసం కొడుకు గొంతుకోసి చంపిన తండ్రి

Crime News: పీకల దాకా మందు కొట్టి.. బాగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. అప్పటికే కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇంట్లో నిద్రపోతున్న చెల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

Crime News: పీకల దాకా మందు కొట్టి.. బాగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. అప్పటికే కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇంట్లో నిద్రపోతున్న చెల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

Crime News: పీకల దాకా మందు కొట్టి.. బాగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. అప్పటికే కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇంట్లో నిద్రపోతున్న చెల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

  ఇంట్లో అక్కాచెల్లి ఉంటే.. వారిని సోదరులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఏ కష్టమూ రానీయరు. కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ యూపీలో ఓ యువకుడు మాత్రం చెల్లి పట్ల రాక్షసుడిగా మారాడు. మద్యం మత్తులో వావి వరసులు మరిచి ప్రవర్తించాడు. 8 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెతో తప్పుడు పనులు చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారకపోవడంతో.. తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కూతురిని కాపాడుకునేందుకు తాగుబోతు కొడుకును హత్య చేశాడు. కుమారుడిని గొంతుకోసి చంపి.. మురికి కాల్వలో పడేశాడు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బారాబంకిలోని దేవ కొత్వాలి ప్రాంతంలో 19 ఏళ్ల యువకుడి శవం మురికి కాల్వలో దొరికింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాల్వలో మృతదేహం కనిపించడంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యువకుడి మెడపైనా, వీపు భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఎవరిపైనా అనుమానం లేదని చెప్పారు. పోలీసులకు ఎన్నో అనుమానాలు ఉండడంతో కుటుంబ సభ్యులపై ప్రశ్నలు కురిపించారు. కొన్ని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. తండ్రిని తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు. తన కుమారుడిని తాను చంపేసినట్లు అంగీకరించాడు. ఐతే ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  Shocking : రెండేళ్ల చిన్నారిపై యవకుడు అత్యాచారం

  చనిపోయిన యువకుడి పేరు శుభమ్ అలియాస్ వికాస్ యాదవ్. తండ్రిపేరు శివరాజ్. ఈయనకు ఓ కూతురు కూడా ఉంది. ఆమె వయసు 8 ఏళ్లు. ఐతే 19 ఏళ్ల వికాస్ యాదవ్ మద్యానికి బానిసయ్యాడు. డ్రగ్స్ కూడా అలవాటు చేసుకున్నాడు. మానుకోవాలని తల్లిదండ్రులు ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. రోజూ తాగొచ్చేవాడు. ఇంటికొచ్చిన తర్వాత తన సొంత చెల్లితోనే అసభ్యంగా ప్రవర్తించేవాడు. తప్పుడు పనులను చేసేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి.

  Shocking : భర్త తల నరికి..ఆలయం ముందు పడేసిన భార్య

  రెండు రోజుల క్రితం కూడా ఇలాగే చేశాడు. పీకల దాకా మందు కొట్టి.. బాగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. అప్పటికే కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. ఇంట్లో నిద్రపోతున్న చెల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో తల్లిదండ్రులు నిద్రలేచి చూశారు. చెల్లి పట్ల అలా ప్రవర్తించిన అన్నను చూసి కోపంతో ఊగిపోయారు. ఆ కోపంలో వికాస్ యాదవ్ గొంతుకోసి చంపేశాడు తండ్రి శివరాజ్. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి మురికి కాల్వలో పడేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి శివరాజ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

  First published:

  Tags: Crime news, Murder, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు