హోమ్ /వార్తలు /క్రైమ్ /

Uttar Pradesh: భర్తకు భరణం చెల్లించాలని భార్యకు ఆదేశం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

Uttar Pradesh: భర్తకు భరణం చెల్లించాలని భార్యకు ఆదేశం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసి పింఛన్ పొందుతున్న మహిళను.. ఖాళీగా ఉండి ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న భర్తకు ప్రతీ నెల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల్లో భార్యకు ప్రతీ నెల మెయింటెనెన్స్ కోసం డబ్బులు చెల్లించాలని భర్తలను కోర్టులను ఆదేశిస్తుంటాయి. ఇలాంటి వార్తలను మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఉత్తర ప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ కోర్టు ఇలాగే ఇచ్చిన ఓ తీర్పు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ తీర్పులో ఆశ్చర్యం ఏముందని అనుకుంటున్నారా? అయితే ఈ కేసులో ప్రతీ నెల డబ్బులు చెల్లించాలని ఆదేశించింది భర్తను కాదు భార్యను. దీంతో ఈ తీర్పును అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసి పింఛన్ పొందుతున్న మహిళను ఖాళీగా ఉండి ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న భర్తకు ప్రతీ నెల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు ఏళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి వారు వేర్వేరుగానే ఉంటున్నారు.

ఈ క్రమంలో భర్త 2013లో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం తన భార్య నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టును కోరాడు. ఈ అంశంపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు గత బుధవారం తీర్పును వెల్లడించింది. పిటీషనర్ భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందింది. దీంతో ఆమెకు నెలకు రూ. 12000 పింఛన్ వస్తోంది. ఈ నేపథ్యంలో భర్తకు నెలకు రూ. వేయి భరణం కింద చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. ఈ తీర్పుతో కేవలం భార్యలకు మాత్రమే కాదు.. భర్తలకు కూడా భార్యలు భరణం చెల్లించాల్సి ఉంటుందన్న విషయం అనేక మందికి తెలిసింది.

తాళి కట్టే సమయంలో ఏడడుగులు నడిచి.. నీతో కలకాలం ఉంటానని చెప్పిన భార్య.. మధ్యలోనే వదిలేసిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గొల్లవాడకు చెందిన ఫణి స్వామి (30)కి ఐదేళ్ల క్రితం సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన విజయతో పెళ్లైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొద్దికాలంగా భార్యాభర్తలు తరుచూ గొడవ పడుతుండటంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మధ్యలో పెద్ద మనుషులు కల్పించుకుని ఇద్దరికి సర్దిచెప్పినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. దీంతో ఏడాది క్రితం తన కొడుకుతో కలిసి విజయ పుట్టింటికి వెళ్లిపోయింది.

విజయ పుట్టింటికి వెళ్లిపోయినప్పట్నుంచి.. తప్పు తెలుసుకున్న ఫణి స్వామి ఆమెను కాపురానికి రావాలని కోరాడు. ఎన్నిసార్లు కోరినా ఆమె నుంచి స్పందన కరువైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఫణి స్వామి.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. దీంతో అతడి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.

First published:

Tags: High Court, Uttar pradesh

ఉత్తమ కథలు