UP BRIDE SAYS NO AFTER GROOM HIS FATHER TURN UP DRUNK AT WEDDING BA
వరుడు చేసిన పనికి ఛీ కొట్టిన వధువు, పీటలపై ఆగిన పెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
గింది. అవినాష్ శ్రీవాస్తవ అనే యువకుడికి, ఖుష్బూ అనే యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. జనవరి 30న పెళ్లి జరగాల్సి ఉంది. ఓ వైపు మండపంలో పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయి. పెద్దలు అందరూ పెళ్లికి వచ్చారు.
ఉత్తరప్రదేశ్లో పెళ్లిమండపానికి తాగి వచ్చిన వరుడిని చూసి వధువు ఛీ కొట్టింది. ఈ తాగుబోతును పెళ్లిచేసుకోబోనని కుండబద్దలు కొట్టింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. యూపీలోని బిన్నావా గ్రామంలో గత బుధవారం ఈ ఘటన జరిగింది. అవినాష్ శ్రీవాస్తవ అనే యువకుడికి, ఖుష్బూ అనే యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. జనవరి 30న పెళ్లి జరగాల్సి ఉంది. ఓ వైపు మండపంలో పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయి. పెద్దలు అందరూ పెళ్లికి వచ్చారు. భోజనాల హడావిడి నడుస్తోంది. కానీ, పెళ్లికొడుకు, అతని తండ్రి మాత్రం కనిపించలేదు.
నమూనా చిత్రం
కొంతసేపటి తర్వాత ఇద్దరూ తీరిగ్గా మండపానికి చేరుకున్నారు. వారు మండపం వద్దకు రాగానే విషయం అర్థం అయిపోయింది. ఇద్దరూ ఫుల్లుగా మందుకొట్టి పెళ్లి మండపానికి వచ్చారు. కాసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లికొడుకు ఇప్పుడే ఫుల్లుగా తాగి వస్తే, రేపు పెళ్లయిన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న భావన పెళ్లికూతురిలో కలిగింది. దీంతో అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు పెళ్లిని రద్దు చేసింది. తాళి బొట్టు కట్టించుకోబోనని తేల్చిచెప్పింది.
ప్రతీకాత్మక చిత్రం
పీటల మీద పెళ్లిని ఆపేయడంతో పెళ్లికొడుకు వైపు వాళ్లు కూడా గొడవకు దిగారు. ఇంతదూరం వచ్చిన తర్వాత పెళ్లి ఎలా ఆపుతారంటూ హంగామా చేశారు. అయినా పెళ్లికూతురు మాత్రం ససేమిరా అంది. దీంతో కుల పెద్దలు కూర్చుని పంచాయితీ చేశారు. పెళ్లికొడుక్కి, అతని తండ్రికి నాలుగు ‘అక్షింతలు’ వేశారు. పెళ్లికుమార్తెను శభాష్ అని మెచ్చుకున్నారు.
మద్యం (File)
ఇక పెళ్లి జరగదు అని డిసైడ్ అయిన తర్వాత డబ్బుల విషయం చర్చకు వచ్చింది. తాము ఈ పెళ్లి కోసం ఎంతో ఖర్చు పెట్టామని, బోలెడు డబ్బులు పోసి పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేశామని పెళ్లికొడుకు తరఫు వాళ్లు వాదించారు. అయితే, ఆ డబ్బులు ఇచ్చేయడానికి వధువు తరఫు వాళ్లు అంగీకరించారు. ఈ మేరకు ఇరువర్గాలు రాతపూర్వకంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అనంతరం పెళ్లిదుస్తుల్లోనే ఇళ్లకు వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.