యువతిని తుపాకీతో బెదిరించి గ్యాంగ్‌రేప్.. బీజేపీ నేత అరెస్ట్..

శ్యామ్ ప్రకాశ్ ద్వివేది సంగం నగరంలో చాలా బలమైన నేత అని తెలుస్తోది. కాశీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. శ్యామ్ ప్రకాశ్ తండ్రి రామరక్ష ద్వివేది ప్రయాగ్ రాజ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

news18-telugu
Updated: October 4, 2020, 7:29 PM IST
యువతిని తుపాకీతో బెదిరించి గ్యాంగ్‌రేప్.. బీజేపీ నేత అరెస్ట్..
శ్యామ్ ప్రకాశ్ ద్వివేది
  • Share this:
యూపీలో హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఘటపై యావత్ దేశం భగ్గమంటోంది. యోగి ఆదిత్యానాథ్ పాలనలో మహిళల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ తరుణంలో ఓ గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ నేతల అరెస్ట్ అవడం ఇప్పుడు మళ్లీ సంచలన రేపుతోంది.  కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న బీజేపీ యువ మోర్చా నేత శ్యామ్ ప్రకాశ్ ద్వివేదిని ఆదివారం ప్రయాగ్ రాజ్ పోలీసులు భక్షి డ్యామ్ సమీపంలో అరెస్ట్ చేశారు. బీఏ స్టూడెంట్‌పై  అత్యాచారం చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన అనుచరుడు అనిల్ ద్వివేది అరెస్టయ్యాడు.

బీజేపీ నేతల శ్యామ ప్రకాశ్ ద్వివేది, అనిల్ ద్వివేది తనను తుపాకీతో బెదరించి అత్యాచారం చేశారని కొన్ని రోజులు క్రితం ఓ విద్యార్థిని ప్రయాగ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఓ భూమి అమ్మకం విషయంలో వీరిద్దరు తనను 2019లో కలిశారని.. డీల్ గురించి మాట్లాడేందుకు హోటల్‌కు పిలిచారు. హోటల్ రూమ్‌లో తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఈ సంవత్సరం మార్చిలోనూ తన ఇంట్లోకి ప్రవేశించి.. మరోసారి రేప్ చేశారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు కూడా యూపీలో తీవ్ర దుమారం రేపుతోంది. అనిల్ ద్వివేదిని అరెస్ట్ చేసిన పోలీసులు.. శ్యామ్ ప్రకాశ్ ద్వివేదిని అరెస్ట్ చేయకుండా వెనకేసుకు వస్తున్నారని విపక్షాలు భగ్గుమన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా ప్రయాగ్ రాజ్‌లో పోస్టర్లు కూడా అంటించారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ నేతకు మద్దతు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

శ్యామ్ ప్రకాశ్ ద్వివేది సంగం నగరంలో చాలా బలమైన నేత అని తెలుస్తోది. కాశీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. శ్యామ్ ప్రకాశ్ తండ్రి రామరక్ష ద్వివేది ప్రయాగ్ రాజ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. శ్యామ్ ప్రకాశ్ ద్వివేదితో రాజకీయాలతో పాటు హోటల్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన అనచరుడు అనిల్ ద్వివేది ప్రయాగ్ రాజ్‌లోని సాహ్బతిబాగ్ ప్రాంతంలో ప్రవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. ఐతే గ్యాంగ్ రేప్ ఆరోపణలను శ్యామ్ ప్రకాశ్ ఖండిస్తున్నారు. మత మార్పిడిలకు వ్యతిరేకంగా తాను ఉద్యమం చేస్తున్నానని.. ఆ కోపంతోనే తనపై ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Published by: Shiva Kumar Addula
First published: October 4, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading