హోమ్ /వార్తలు /క్రైమ్ /

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ మూవీపై వివాదం.. యువకులకు కత్తిపోట్లు.. పోలీసుల రంగంలోకి దిగి ఎన్‌కౌంటర్

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ మూవీపై వివాదం.. యువకులకు కత్తిపోట్లు.. పోలీసుల రంగంలోకి దిగి ఎన్‌కౌంటర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాశ్మీర్ ఫైల్స్ మూవీ సినిమా వివాదంలో ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేసిన ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files).. మన దేశంలో ఇప్పుడీ మూవీ ఓ సంచలనం. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోమంత్రి అమిత్ షా (Amit Shah) కూడా ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై ప్రశంసలు కురిపించాయి. బీజేపీపాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. ఐతే ఈ మూవీ కేంద్రంగా నేరాలు చోటుచేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ది కాశ్మీర్‌ ఫైల్స్ పేరుతో ఇప్పటికే సైబర్ నేరగాళ్లు మోసగాళ్లకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సినిమా చూస్తున్న వారిపై దాడులు కూడా చేస్తున్నారు.ఇటీవల యూపీ (Uttar Pradesh) లోని ఖుషీనగర్‌లో ముగ్గురు వ్యక్తులపై దుండుగులు దాడి చేశారు. ఐతే కాశ్మీర్ ఫైల్స్ మూవీ సినిమా వివాదంలో ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేసిన ముఠాపై తాజాగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

పుష్పను మించిపోయారు.. అరటి పళ్ల లారీలో కోటి రూపాయల గంజాయి.. ఏపీ నుంచి యూపీకి..

అసలేం జరిగిందంటే..?

మార్చి 18న ఫాజిల్‌నగర్ పట్టణంలోని ఓ థియేటర్ వద్ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులను దండుగులు కత్తితో పొడిచి పారిపోయారు. ఈ ఘటనను పోలీసులు ముందు లైట్ తీసుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో సీరియస్‌గా తీసుకున్నారు. మైనుద్దీన్, జైనుద్దీన్ అలియాస్ గోగా, రాజా ఖర్వార్, అనీష్ అనే నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే మైనుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్ తర్వాత మిగతా ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఐతే దమ్ముంటే తమను పట్టుకోవాలంటూ.. జైనుద్దీన్ సవాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.

OMG: మహిళపై అమానుషం.. మత్తులో ఉండగా.. నడిరోడ్డుపై అందరి ముందే ఆ పని కానిచ్చేశారు..


గురువారం సోన్‌బర్సా పట్టి సమీపంలో పోలీసుల బృందానికి జైనుద్దీన్, రాజా ఖర్వార్, అనీష్ తారసపడ్డారు. వారు బైక్‌పై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జైనుద్దీన్ తుపాకీ తీసి... పోలీసులపై కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో జైనుద్దీన్‌ కాలికి గాయాలు కావడంతో అక్కడే పడిపోయాడు. చీకట్లో మిగతా ఇద్దరు పారిపోయారు. పోలీసులు వెంబడించినప్పటికీ దొరకలేదు. ఐతే గాయపడిన జైనుద్దీన్‌ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి నాటు తుపాకీ, కాల్చిన బుల్లెట్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కాల్పుల్లో ఫాజిల్ నగర్ ఔట్ పోస్ట్ ఇంచార్జి అలోక్ యాదవ్‌కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఫాజిల్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోగా కూడా అక్కడే ఉన్నాడు. అతడి నుంచి మిగతా ఇద్దరి నిందితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్ గతంలోనూ పలు నేరాలను పాల్పడినట్లు గుర్తించారు. అందుకే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.

First published:

Tags: The Kashmir Files, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు