హోమ్ /వార్తలు /క్రైమ్ /

Uttar Pradesh: రాత్రివేళ స్పెషల్ క్లాస్‌కు రమ్మని, అమ్మాయిలకు స్వీటులో మత్తు మందు కలిపి...మాస్టారు ఏం చేశాడంటే...

Uttar Pradesh: రాత్రివేళ స్పెషల్ క్లాస్‌కు రమ్మని, అమ్మాయిలకు స్వీటులో మత్తు మందు కలిపి...మాస్టారు ఏం చేశాడంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ పాఠశాలలో 17 మంది హైస్కూల్ విద్యార్థినులకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఒక ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 17 మంది విద్యార్థినులను రాత్రి పాఠశాలలో ప్రాక్టికల్స్ పేరుతో ఆపి వారికి మత్తు మందు ఇచ్చి వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ఉపాధ్యాయుడు ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

Crime News: మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. అందుకే దాన్ని భరిస్తూ ఉండిపోతారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ  పాఠశాలలో 17 మంది హైస్కూల్ విద్యార్థినులకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఒక ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.  17 మంది విద్యార్థినులను రాత్రి పాఠశాలలో ప్రాక్టికల్స్ పేరుతో ఆపి వారికి మత్తు మందు ఇచ్చి వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ఉపాధ్యాయుడు ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక నోరు విప్పితే ఫెయిల్ చేస్తానని నిందితుడు టీచర్ బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇద్దరు బాధిత బాలికలు తమ కుటుంబాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: గడువు లోపు పోలవరం పూర్తవ్వడం అసాధ్యం.. బాంబు పేల్చిన కేంద్రం

విషయం ఏమిటి

పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుఘల్‌పూర్ కమ్హేరా గ్రామంలో ఒక పాఠశాల ఉంది. హైస్కూల్‌కు చెందిన 17 మంది బాలికలను నవంబర్ 18న ప్రాక్టికల్ సాకుతో పుర్కాజీలోని GGS ఇంటర్నేషనల్ అకాడమీ స్కూల్‌కు తీసుకొచ్చారు. పాఠశాల నిర్వాహకుడు అర్జున్ సింగ్ ఆహారంలో మత్తు పదార్థాలు ఇస్తూ అసభ్యకర పనులు చేయడంతో పాటు తమను వేధించాడని బాలిక విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత 5 రోజులుగా ఫిర్యాదు చేసినప్పటికీ ఈ సంచలన కేసును అణిచివేసే పనిలో పుర్కాజీ పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఇద్దరు బాలికలు, కుటుంబంతో సహా, ఈ విషయంపై SSP కి ఫిర్యాదు చేసారు. అప్పుడు పోలీసు అధికారులు వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుర్కాజీ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్‌ను ఆదేశించారు.

ఇదీ చదవండి: నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్

అయితే, బాధిత బాలిక విద్యార్థుల బంధువుల ఫిర్యాదుతో, పోలీసులు రెండు పాఠశాలలకు చెందిన యోగేష్ , అర్జున్ సింగ్‌లపై ఐపిసి సెక్షన్లు 328,354, 506 అలాగే ప్రొటెక్షన్ 7 , 8 కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.


ఇది చూడండి..

First published:

Tags: Crime

ఉత్తమ కథలు