హోమ్ /వార్తలు /క్రైమ్ /

News18 Exclusive : అధునాతన డ్రోన్స్ తో యాంటీ నక్సల్ ఆపరేషన్..భారీగా నక్సలైట్లు మృతి!

News18 Exclusive : అధునాతన డ్రోన్స్ తో యాంటీ నక్సల్ ఆపరేషన్..భారీగా నక్సలైట్లు మృతి!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Anti Naxal Operation In Bastar : ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో..సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో భద్రతా బలగాలు భారీ యాంటీ-నక్సల్ ఆపరేషన్‌ను నిర్వహించాయని ఉన్నతస్థాయి అధికార వర్గాలు న్యూస్ 18కి తెలిపాయి

ఇంకా చదవండి ...

Anti Naxal Operation In Bastar : ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో..సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో భద్రతా బలగాలు భారీ యాంటీ-నక్సల్ ఆపరేషన్‌ను నిర్వహించాయని ఉన్నతస్థాయి అధికార వర్గాలు న్యూస్ 18కి తెలిపాయి. అధునాతన డ్రోన్‌ల సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడినట్లు వారు తెలిపారు. వాస్తవానికి,డ్రోన్లను నక్సల్స్‌ పై ఆయుధాలుగా ఉపయోగించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఈ మొత్తం ఆపరేషన్ ను ఢిల్లీలోని ఉన్నత భద్రతా అధికారులు పర్యవేక్షించారని..ఆపరేషన్ పూర్తయిన తర్వాత, CRPF సీనియర్ అధికారులు ఛత్తీస్‌గఢ్‌ కు కూడా వెళ్లారు. ఈ ఆపరేషన్ లో భారీగా నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. నక్సల్స్‌ రహస్య స్థావరాలపై దాడులు జరిపిన కొద్ది నిమిషాల్లోనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంపై దూకుడుగా దాడి చేసి బాంబులతో విరుచుకుపడ్డాయని అధికారులు ధృవీకరించారు.

ఆపరేషన్ హడావిడిగా నిర్వహించలేదని, దాదాపు రెండు నెలల సన్నాహకాల తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ ప్రణాళికను ఖరారు చేయడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు కె విజయ్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారని వారు తెలిపారు. గత 40-50 రోజులలో వివరాలను సేకరించి, లొకేషన్‌ను నిర్ధారించిన తర్వాత, CRPF నేతృత్వంలోని భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా నేరుగా ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ALSO READ Prashant Kishor: కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్! -సోనియా గాంధీతో భేటీ -ఏం మాట్లాడుకున్నారంటే..

అయితే ఈ ఆపరేషన్ నుంచి మోస్ట్‌ వాంటెడ్‌ నక్సల్‌ లీడర్‌ మద్వి హిద్మా తప్పించుకున్నట్లు భద్రతా సంస్థలు ధృవీకరిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న CRPF డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ ను దీని గురించి మరిన్ని వివరాలనున్యూస్18 కోరింది... అతని అతను ఇంకా ఈ ఆపరేషన్ పై స్పందిచలేదు. వివిధ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంచబడ్డాయని, భారీ నష్టాన్ని చవిచూసిన తిరుగుబాటుదారులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

First published:

Tags: Chatisghad, CRPF, Naxals

ఉత్తమ కథలు