బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసు బాధితురాలుకు రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలుకు రోడ్డు ప్రమాదం

ఫతేపూర్ నుంచి రాయ్‌బరేలి వైపు వెళ్తున్న కారును... అతివేగంగా వచ్చిన ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితురాలి బంధువులు మృతిచెందారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా కలకలం రేపిన యూపీ ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగార్ అత్యాచారం కేసులో బాధితురాలుకు మరో షాక్ తగిలింది. ఆదివారం బాధితురాలు...ప్రయాణిస్తున్న కారును... భారీ ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా...మరికొందరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం బాధిత యువతి తన ఇద్దరు ఆంటీలు,లాయర్‌తో కలిసి రాయ్‌బరేలిలో జైల్లో ఉన్న తన మామయ్యను కలిసేందుకు కారులో బయల్దేరారు. ఫతేపూర్ నుంచి రాయ్‌బరేలి వైపు వెళ్తున్న కారును... అతివేగంగా వచ్చిన ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితురాలి బంధువులు మృతిచెందారు. గాయపడిన మిగలిని వారిని చికిత్సనిమిత్తం లక్నో కింగ్ ఛార్జ్ మెడికల్ యూనివర్శిటీకి తరలించారు.

    ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... ట్రక్ వేగంగా దూసుకురావడంతో... డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేయలేక కారుపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరపున ఓ గన్ మేన్‌ను పంపించినప్పటికీ అతను ఆ సమయంలో అక్కడ లేకపోవడం కూడా అనేక అనుమనాల్ని తెరపైకి తీసుకొచ్చింది.

    గతేడాది ఏప్రిల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఓ యువతి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగార్ తనను అత్యాచారం చేశాడంటూ ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ కేసును అప్పట్లో సీబీఐకు అప్పగించారు. ఆ తర్వాత యువతి తండ్రిని కూడా ఎమ్మెల్యే సోదరుడు తీవ్రంగా కొట్టి జైల్లో పెట్టించాడు. ఈ ఘటనలో బాధితురాలు తండ్రి తీవ్రగాయాలపాలై పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు.
    First published: