ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పసిపాప మాయం... నమ్మి బిడ్డనిస్తే....

ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో ఇప్పటికే కిడ్నాపర్‌ను పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు.

news18-telugu
Updated: November 26, 2019, 12:34 PM IST
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పసిపాప మాయం... నమ్మి బిడ్డనిస్తే....
సీసీఫుటేజ్‌లో రికార్డ్ అయిన కిడ్నాపర్ దృశ్యాలు
  • Share this:
అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్ అయ్యింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచుసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవికి డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. ఈ రోజు ఉదయం సుమారు 6.30గం ల సమయలో గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. అయితే సదరు మహిళను నమ్మి బిడ్డనిస్తే ఎత్తుకెళ్లిదంటూ పాప బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకు పాలు పట్టిస్తానంటే బిడ్డను ఇచ్చినట్లు చెబుతున్నారు. పాప పుట్టి 15 రోజులు అవుతున్నట్లు సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో ఇప్పటికే కిడ్నాపర్‌ను పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 26, 2019, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading