హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన పరువు హత్య ఘటన మరువకముందే.. నగరంలో అలాంటి దారుణం చోటు చేసుకుంది. బేగంబజార్‌లోని(Begum Bazar) మచ్చి మార్కెట్ దగ్గర సూరజ్ పన్వార్ అనే యువకుడిని బైక్‌పై వచ్చిన దుండుగులు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపారు. యువకుడి శరీరంపై కత్తితో 20 సార్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. దుండగుల చేతిలో కత్తులు ఉండటంతో వారిని ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అయితే ఏడాది క్రితం సూరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నాడని.. అమ్మాయి తరపున బంధువులే సూరజ్‌పై కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్టు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం అఫ్జల్ గంజ్‌కు(Afzal Gunj) చెందిన యువతిని సూరజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ అమ్మాయి సోదరుడే తన స్నేహితులతో కలిసి సూరజ్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు యువకులు.. సూరజ్‌పై అతి దారుణంగా పొడిగి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సూరజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇక రెండువారాల క్రితం హైదరాబాద్‌లోని(Hyderabad) సరూర్ నగర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ యువతి సోదరుడు ఆమె భర్తను హత్య చేశాడు. గడ్డపారలతో అతనిపై దాడి చేసి హతమార్చాడు. కళ్లెదుటే తన భర్తను చంపడంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా రోధించింది. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం అశ్రిన్ ఇంట్లో తెలియడంతో ఆమెను మందలించారు. సుల్తానాను ప్రేమించవద్దని నాగరాజును హెచ్చరించారు. అయితే ఇద్దరూ జనవరి 31న లాల్ దర్వాజలోని ఆర్య సమాజ్‌లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి విషయంలో సుల్తానా ఇంట్లో తెలియడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌ను వీడి విశాఖపట్నంలో ఉన్నారు. ఇక తమకేమీ కాదని భావించి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకి ఉన్నారు. అయితే స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో అప్పటికే మాటు వేసి ఉన్న సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు... బైక్‌పై వారిని వెంబడించారు. నాగరాజుపై గడ్డపారలతో దాడి చేసి హత్య చేశారు. ఆ ఘటన జరిగిన రెండు వారాల్లోనే ఈ రకమైన ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.