ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు.. యువతి బాత్రూమ్‌కి వెళ్తుండగా వెంబడించి..

ఓయూలోని ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో గురువారం రాత్రి 2.30 నుంచి 3గంటల మధ్యలో ఓ ఆగంతకుడు దూరాడు.

news18-telugu
Updated: August 15, 2019, 8:03 PM IST
ఓయూ లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు.. యువతి బాత్రూమ్‌కి వెళ్తుండగా వెంబడించి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 15, 2019, 8:03 PM IST
ఉస్మానియా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లో ఆగంతకుడు ప్రవేశించిన ఘటన కలకలం రేపుతోంది. ఓయూలోని ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో గురువారం రాత్రి 2.30 నుంచి 3గంటల మధ్యలో ఓ ఆగంతకుడు దూరాడు. ఆ సమయంలో ఓ విద్యార్థిని బాత్రూమ్‌కి వెళ్లింది. ఆగంతకుడు ఆమెను అనుసరించాడు. అయితే, ఈ విషయాన్ని ఆమె గమనించలేకపోయింది. ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లిన తర్వాత బయట నుంచి గడి పెట్టేశాడు. ఆతర్వాత బాత్రూమ్ పై నుంచి అందులోకి దూకి.. యువతిని కత్తితో బెదిరించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో హాస్టల్లో ఉన్నవారు పరుగులు పెడుతూ వచ్చారు. దీంతో ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆమె సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లాడు. అయితే, మధ్యలోనే దాన్ని వదిలేసి పారిపోయాడు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...