వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 4:35 PM IST
వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు (File)
  • Share this:
వైసీపీ ఎంపీ ఇంటి మీద కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ ఇంటి అద్దాలు పగిలాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. ఎంపీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని వాచ్‌మెన్‌ను బెదిరించారు. దీంతో వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయ. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>