వనస్థలిపురంలో భారీ చోరీ... ఏటీఎం వ్యాన్ నుంచి రూ.70 లక్షలు దోచుకెళ్లిన ఘరానా దొంగలు...

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మనీ లోడింగ్ వ్యాన్ నుంచి రూ.70 లక్షలు దోచుకెళ్లిన ఘరానా దొంగలు... వనస్థలిపురం పనామా కూడలి దగ్గర భారీ చోరీ... నిందితుల కోసం గాలిస్తున్న పోలీస్ టీమ్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 4:27 PM IST
వనస్థలిపురంలో భారీ చోరీ... ఏటీఎం వ్యాన్ నుంచి రూ.70 లక్షలు దోచుకెళ్లిన ఘరానా దొంగలు...
డబ్బు బాక్సును తరలించిన ఆటో... (సీసీటీవీ ఫుటేజ్)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 4:27 PM IST
హైదరాబాద్ నగర శివారులో వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. పనామా కూడలి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు... సెక్యూరిటీ సిబ్బంది దృష్టి మరల్చి, యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన రూ.70 లక్షలను దోచుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఇద్దరు దుండగులు... డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. అదే సమయంలో మరో వ్యక్తి వాహనంలోని నగదు పెట్టేను ఎత్తుకుని రోడ్డు దాటాడు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టి, రోడ్డుగా దాటించారు. ఆ తర్వాత అటు వైపు మళ్లీ పెట్టెను మోసుకుంటూ పరారయ్యారు. అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పనామా కూడలి చోరీ గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... నిందితుల కోసం గాలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన పోలీస్ టీమ్... దుండగుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ చోరీ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పననేని హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.

Telangana, Hyderabad,Vanastalipuram, robbery in Vanastalipuram, Axis bank vehicle robbery, Vanasthalipuram Axis bank robbery footage, panama x road hyderabad, stolen from axis bank money van, హైదరాబాద్,వనస్థలిపురం చోరీ, యాక్సిస్ బ్యాంక్ వాహనంలో దోపిడి, వనస్థలిపురం యాక్సిస్ బ్యాంకు డబ్బు చోరీ, దృష్టి మరల్చి
సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దుండగుడి ఫోటో


చోరిలో మొత్తం ఐదుగురు భాగం పంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చోరీలో మనీ లోడింగ్ సిబ్బంద హస్తం కూడా ఉండొచ్చనే అనుమానాలు రేగుతున్నాయి. ఏటీఎంల దగ్గర చోరీల గురించి అవగాహన ఉన్నా, అంత తేలిగ్గా ఎలా దుండగుల మాటలు నమ్మి... డబ్బును గాలికొదిలేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

CCTV Video:-వనస్థలిపురంలో భారీ చోరీ...


First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...