హోమ్ /వార్తలు /క్రైమ్ /

కీర్తి రెడ్డి కుటుంబ నేపథ్యం.. హత్య కేసులో అసలు నిజాలు..

కీర్తి రెడ్డి కుటుంబ నేపథ్యం.. హత్య కేసులో అసలు నిజాలు..

Keerthy Reddy kills Mother : కీర్తి రెడ్డి తల్లి చిట్టీల వ్యాపారం చేస్తోంది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. అతను తాగుబోతు కావడంతో ఇంటిని పట్టించుకునేవాడు కాదు.

Keerthy Reddy kills Mother : కీర్తి రెడ్డి తల్లి చిట్టీల వ్యాపారం చేస్తోంది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. అతను తాగుబోతు కావడంతో ఇంటిని పట్టించుకునేవాడు కాదు.

Keerthy Reddy kills Mother : కీర్తి రెడ్డి తల్లి చిట్టీల వ్యాపారం చేస్తోంది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. అతను తాగుబోతు కావడంతో ఇంటిని పట్టించుకునేవాడు కాదు.

  హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మునగనూరులో కన్నబిడ్డే తల్లిని చంపిన కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. నిందితులు కీర్తి రెడ్డి,శశి కుమార్‌లు పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు. శశి కుమార్‌ను కీర్తి రెడ్డి మొదటి నుంచి అన్నయ్య అని పిలిచేది. అయితే అందంగా ఉండే కీర్తి రెడ్డి తనను అన్నయ్య అని పిలవడం శశి కుమార్‌కి ఇష్టం లేదు. బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న అతను ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇందుకోసం రూ.10లక్షలు కావాలనుకున్నాడు. అయితే ఆ డబ్బు కోసం కీర్తి రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేయడం.. చివరకు హత్య దాకా వెళ్లడం జరిగిపోయాయి.

  కీర్తి రెడ్డి తల్లి చిట్టీల వ్యాపారం చేస్తోంది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్. అతను తాగుబోతు కావడంతో ఇంటిని పట్టించుకునేవాడు కాదు. ఈ నేపథ్యంలో కీర్తి డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు తన స్నేహితురాలి సోదరుడైన బాల్‌రెడ్డి(23) పరిచయమయ్యాడు.ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని బాల్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది.అయితే ఆ గర్భాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియక.. ఇంటి పక్కనే ఉండే శశి కుమార్‌ను కీర్తి సాయం కోరింది. దీంతో ఇదే అదనుగా భావించిన అతను మనసులో వేరే స్కెచ్ వేసుకున్నాడు. మహబూబ్‌నగర్‌లోని ఆమన్‌గల్ తీసుకెళ్లి ఆమెకు అబార్షన్ చేయించాడు. అప్పటి నుంచి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. శశి కుమార్ ఇంట్లోనే ఇద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు.

  ఆ సమయంలో శశి కుమార్ కొన్ని ఫోటోలు,వీడియోలు తీశాడు. కీర్తి రెడ్డి తల్లి చిట్టీల వ్యాపారం చేస్తుండటం..వారికి కొన్నిచోట్ల ప్లాట్లు,భూములు ఉన్నాయని తెలియడంతో రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.ఇదే క్రమంలో రజితను చంపేస్తే ఆస్తి అంతా తనకే దక్కుతుందని కీర్తికి చెప్పాడు. కీర్తికి బీర్ సేవించే అలవాటు ఉండటంతో..అక్టోబర్ 19న ఆమెను కారులో బయటకు తీసుకెళ్లి బీర్ తాగించాడు. ఇంటికొచ్చాక మొదట కీర్తి లోపలికి వెళ్లి.. సోఫాలో పడుకున్న తల్లి పక్కన కూర్చుంది. ఆ తర్వాత ప్రియుడిని ఇంట్లోకి పిలిచి తల్లి కళ్లల్లో కారం కొట్టింది. చేతులు కట్టేసి ఛాతిపై కూర్చుంది. వెంటనే శశి కుమార్ రజిత మెడకు శాలువాను బిగించి హత్య చేశాడు.

  అనంతరం కీర్తి రెడ్డి బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తల్లి గొంతుతో మాట్లాడింది. తాము ఊరు వెళ్తున్నామని.. రెండు రోజులు తన కూతురిని మీ ఇంట్లో ఉంచుకోవాలని చెప్పింది. అలా రెండు రోజులు బాల్‌రెడ్డి ఇంట్లో గడిపాక.. 21వ తేదీ రాత్రి ఇంటికొచ్చింది. తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయినట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే అప్పటికే మృతదేహం దుర్వాసన వస్తుండటంతో 22వ తేదీ రాత్రి బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి.. తాడుతో గట్టిగా కట్టి.. శశి,కీర్తి కారులో రామన్నపేట్ బయలుదేరారు. సర్వీస్ రోడ్డు గుండా అక్కడికి వెళ్లి రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేశారు. దారిలో పెట్రోల్ పోసి బెడ్‌షీట్,తాడు కాల్చేశారు. 23న కీర్తి విశాఖపట్నం వెళ్లిపోయింది. 26వ తేదీన తల్లి కనిపించడం లేదంటూ తండ్రి ఫోన్ చేయడంతో తిరిగొచ్చింది. తండ్రి బలవంతంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చివరకు పోలీసుల విచారణలో నిజాలు బయటపెట్టింది.

  First published:

  Tags: Hyderabad

  ఉత్తమ కథలు