హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ఆస్పత్రిలో బెడ్ లు లేవని వెళ్ళగొట్టారు.. ఇంట్లో గర్భస్రావం.. ఫ్రిజ్ లో శిశువు.. అసలేం జరిగిందంటే..

OMG: ఆస్పత్రిలో బెడ్ లు లేవని వెళ్ళగొట్టారు.. ఇంట్లో గర్భస్రావం.. ఫ్రిజ్ లో శిశువు.. అసలేం జరిగిందంటే..

తమ బిడ్డను గుర్తు చేసుకుంటున్న దంపతులు

తమ బిడ్డను గుర్తు చేసుకుంటున్న దంపతులు

London: లండన్ ఒక మహిళకు చేదుభవం ఎదురైంది. ఆమెకు ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమెకు ఆస్పత్రిలో బెడ్ లు ఖాళీగా లేవని తిరిగి పంపించేశారు.

కొన్ని సార్లు ఆస్పత్రి సిబ్బంది రోగి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. బిల్లుల విషయంలో, సదుపాయాల విషయంలో ఆస్పత్రికి వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కొన్ని సందర్భాలలో సరైన సదుపాయాలు కూడా కల్పించడంలో విఫలమౌతుంటారు. దీంతో ఆస్పత్రికి వచ్చరే వారు అనేక ఇబ్బందులు పడిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. యూకే లో (United kingdom) ఈ ఘటన గతంలో జరిగింది. తాజాగా, బాధితురాలు తన ఇన్ స్టాలో వేదికగా తన బాధను పంచుకుంది. దీంతో అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. లారెన్స్ వైట్, లారా బ్రాడీ దంపతులు. లారెన్స్ వైట్ కు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె లెబిషామ్ లోని యూనిర్శిటీ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఆస్పత్రి సిబ్బంది సరిగ్గా స్పందించలేదు.

బెడ్ లు లేవని జాయిన్ చేసుకొవడానికి నిరాకరించారు. ఆ తర్వాత.. ఆమె ఇంటికి వెళ్లాక టాయ్ లెట్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు గర్భస్రావం మైంది. ఆ తర్వాత.. శిశువు మరణించాడు. దీంతో ఆమె శిశువుని ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ లో పెట్టాల్సి వచ్చింది. తాజగా, ఈ జంట గ్లోబల్ గర్భస్రావాలపై ఒక డాక్యుమెంటరీని చూసిన తర్వాత తాము ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా  డెంటల్ ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన యువతికి అనుకొని ఘటన ఎదురైంది.

ఐడా అజీజీ అనే 26 ఏళ్ల యువతికి డెంటల్ (Dental treatment) సమస్యలు వచ్చాయి. ముందు దంతాలు అన్ని పాడయి, ఒక వరుసలో సరిగ్గా లేవు. దీంతో ఆమె డెంటల్ డాక్టర్లను సంప్రదించింది. వారు ఆమెకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని అన్నారు. దీంతో ఆమె తక్కువ ధరకే ఎక్కడ ట్రీట్ మెంట్ చేస్తారని సెర్చ్ చేసింది . దీంతో ఆమెకు ఇరాన్ లో (Iran) తక్కువ ధరకే ట్రీట్ మెంట్ ఇస్తారని తెలుసుకుంది. వెంటనే ఇరాన్ లోని టెహ్రన్ కు వెళ్లింది. అక్కడి వైద్యులను సంప్రదించింది.

ఆ తర్వాత.. వైద్యులు దంత ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో వైద్యం పూర్తయ్యాక ఆమెకు కొత్త దంతాలు అమర్చారు. అవి మునపటి కంటే ఎంతో పెద్దవిగా ఉన్నాయి. దీంతో ఆమె మాట పూర్తిగా మారిపొయింది. అసలు ఏ పదార్థాలు సరిగ్గా తినలేక పోయింది. ఆమె దంతాలు పియానో బటన్ ల (piano keys teeth) మాదిరిగా పెద్దవిగా ఉన్నాయి. దీంతో ఆమె తాను పడుతున్న బాధను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. టెహ్రన్ లో వైద్యం బాగా చేయలేదని, తన దంత సమస్య రెట్టింపయ్యిందని , మాట్లాడటం కూడా సరిగ్గా రావడం లేదని బాధపడింది. దీంతో ఆమెను మరో డాక్టర్ ట్రీట్ మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. బాధతో ఉన్న యువతికి దంతాలను తిరిగి సరిగ్గా అమరుస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First published:

Tags: London, United Kingdom, VIRAL NEWS

ఉత్తమ కథలు