కొందరు కామాంధులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. మహిళలు, అమ్మాయిల పైన అఘాత్యాలకు పాల్పడుతుంటారు. కొంత మంది మంచిగా ఉన్నట్లు నటిస్తారు. ఇతరులతో పరిచయం పెంచుకుంటారు. వీరి మాటలను నమ్మిన తర్వాత.. అసలు నిజస్వరూపం బయటపెడుతారు. కొంత మంది పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తుంటారు. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. మరికొందరు నీచులైతే.. పశువులపైన అఘాయిత్యాలకు (Harassment) పాల్పడుతుంటారు. వీరు.. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రతి చోట.. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు, దారుణాలకు తెగబడుతుంటారు. కొందరు పోలీసులు కూడా ఈ మధ్య మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఈ మధ్య కాలంలో వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన పోలీసు అధికారి వేధింపుల ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. యూకేలో (united kingdom) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. విల్డ్ షైర్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఆడమ్ రీడ్స్ అనే అధికారి నీచంగా ప్రవర్తించాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి పట్ల అందరి ముందే జుగుప్సకరంగా ప్రవర్తించాడు. ఆడమ్ రీడ్స్.. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగి ప్యాంటు విప్పించాడు. అందరిముందే అతని పురుషాంగం సైజ్ చిన్నదిగా ఉందని హేళన చేశాడు. దీంతో సదరు వ్యక్తి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆడమ్ రీడ్స్ ను విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత.. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో.. ఆడమ్ తన తప్పును అంగీకరించాడు. తాను కావాలని... చేయలేదని సరదాగా ఆటపట్టించడం కోసం చేశానని అన్నాడు. ఈ ఘటన ఇంత పెద్దది అవుతుందని అనుకొలేదని అధికారులకు తన వాదన వినిపించాడు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలను అందరిముందు ప్రస్తావించి, అతనికి ఇబ్బందులు గురిచేసినందుకు గాను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అదే విధంగా, అతను యూకేలో మరోసారి ఏ పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అయితే, ఈ సంఘటన గతేడాది నవంబరు 2021 లో డివైజెస్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. కాగా, కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తిని భయభ్రాంతులకు గురయ్యేలా ప్రవర్తించాడని అధికారులు గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దీనిపై డిప్యూటీ చీఫ్ పోలీసు అధికారి మాట్లాడుతూ..నిందితుడు .. ఆడమ్ రీడ్ చర్యలు మన్నించ తగినవి కావు. అవి పూర్తిగా.. అతని సహోద్యోగి గౌరవానికి భంగం కలిగించాయి. ఈ చర్యల వలన అతను ఎంతో మనోవేదనకు గురయ్యాడు. అతని చర్యలు అసహాజ లైంగిక ప్రవర్తనతో సమానం.
విల్ట్‌షైర్ పోలీసుల నుండి ఆడమ్ రీడ్‌ను తొలగించాలని LQC తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఫోర్స్ చేత ఆమోదించబడింది అని అధికారి మిల్స్ చెప్పారు. ప్రస్తుతం అతను ఇప్పుడు యూకేలోని.. జాతీయ నిషేధిత జాబితాలో ఉంచబడతాడు. అతను భవిష్యత్తులో పోలీసింగ్‌లో పని చేయలేడని నిర్ధారిస్తుందని అధికారి మిల్స్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, London, United Kingdom