హోమ్ /వార్తలు /క్రైమ్ /

Lakhimpur: లఖీంపూర్​ ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు అరెస్టు... 12 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం చర్యలు

Lakhimpur: లఖీంపూర్​ ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు అరెస్టు... 12 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం చర్యలు

ఆశిష్​ మిశ్రాను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు (Photo :ANI/ Twitter)

ఆశిష్​ మిశ్రాను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు (Photo :ANI/ Twitter)

రైతులు (farmers) చనిపోయిన ఘటన అనంతరం ఆశిష్ మిశ్రా నేపాల్‌కు పారిపోయాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా​ను ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇంకా చదవండి ...

ఉత్తర్‌ప్రదేశ్​లోని లఖీంపూర్ ఖేరీ (Lakhimpur kheri ) కారు ప్రమాద ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish Mishra)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.  వారం రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఆశిష్ మిశ్రాను  12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఉత్తరప్రదేశ్​ పోలీసులు అరెస్ట్ (arrest) చేసినట్లు తెలుస్తోంది. లఖీంపూర్​లో రైతుల హత్యాకాండ కేసును డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఉపేంద్ర అగర్వాల్ దర్యాప్తు చేస్తున్నారు. రైతులు (farmers) చనిపోయిన ఘటన అనంతరం ఆశిష్ మిశ్రా నేపాల్‌కు పారిపోయాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా​ను ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)​ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆశిష్ మిశ్రాతో సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

న్యాయవాదుల పిల్​తో..

ఈ కేసు విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశిష్‌పై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana) వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న చోటుచేసుకున్న హింసపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్​ను విచారణ చేస్తున్నది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ (bench) ఈ కేసును టేకప్ చేసింది.

గురువారం నాటి బెంచ్ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరుగుతోన్న తీరుపై యూపీ సర్కారు శుక్రవారం నాడు ఒక స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. సదరు రిపోర్టుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.

లఖీంపూర్ కేసులో యూపీ సర్కారు (UP Government) తీసుకున్న చర్యలు, హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయకపోవడంపై యూపీ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.  దసరా తర్వాత కేసు పురోగతిని తెలుసుకుంటామని సీజేఐ చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అశిష్​ మిశ్రాను ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆశిష్​ సమాధానం చెప్పకపోవడంతో  పోలీసులు అరెస్టు చేశారు.

శనివారం రాత్రే ఆశిష్​ మిశ్రాను న్యాయమూర్తి ఎదుట పరిచారు. దీంతో ఆశిష్​కు జ్యుడీషియల్​ కస్టడీ విధించారు జడ్జి. ఈ మేరకు ఆశిష్​ను జిల్లా జైలుకు తరలించారు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Arrested, Police, Uttar pradesh

ఉత్తమ కథలు