హోమ్ /వార్తలు /క్రైమ్ /

Delhi | Viral news: లివింగ్ రిలేషన్ వల్లే శ్రద్దా వాకర్ హత్య ..కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యలపై శివసేన ఫైర్

Delhi | Viral news: లివింగ్ రిలేషన్ వల్లే శ్రద్దా వాకర్ హత్య ..కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యలపై శివసేన ఫైర్

kaushal kishore(File)

kaushal kishore(File)

Delhi|Viral news:కేంద్రమంత్రి కౌశల్‌ కిషర్‌ ఢిల్లీ శ్రద్దా వాకర్ మర్డర్ కేసుపై స్పందించిన తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. వెంటనే ఆయనికి మంత్రి పదవి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు శివసేన నాయకులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gaya, India

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఓ యువతిని ప్రియుడే చంపి..35ముక్కలు చేసి నగరంలో చెల్లాచెదురుగా పడివేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈకేసులో నిందితుడ్ని గుర్తించిన పోలీసులు(Police)పట్టుకున్నారు. అయితే ఈఘటనపై కేంద్రమంత్రి కౌశల్‌ కిషర్‌ (Kaushal Kishore)స్పందించిన తీరుపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ శివసేన(Shiv Sena)నాయకులు సోషల్ మీడియా(Social media) వేదికగా ఎండగడుతున్నారు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన మంత్రిని క్యాబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

OMG: గరిటలా మారిన జేసీబీ... ప్రసాదం తయారీకి ప్రొక్లెయిన్లు, కాంక్రీట్ మిక్సర్లు..

మంత్రి నోట అదేం మాట..

ఢిల్లీ మౌహ్రాలిలో జరిగిన శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి ముక్కలుగా చేశాడు ఆమె ప్రియుడు అప్తాబ్ అమీన్‌ పూనావాల. ఈకేసులో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి సున్నితమైన, సెంటిమెంట్‌తో కూడిన విషయాలపై జాగ్రత్తగా మాట్లాడాల్సిన కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్దా వాకర్‌ ప్రియుడితో కలిసి సహజీవనం చేయడం వల్లే హత్య జరిగిందన్నారు. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాలలోకి రాకూడదని ఆయన సూచించారు.

మండిపడుతున్న విపక్షాలు ..

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ నేరాలకు దారి తీస్తుందని చెప్పారు కేంద్రమంత్రి. చదువుకున్న అమ్మాయిలు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి తమకు నచ్చిన వాళ్లతో సహజీవనం చేస్తున్నారని అమ్మాయిలను తప్పుపట్టారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. అసలు అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రి. ఇష్టపడిన వ్యక్తితో కలిసి జీవించడానికి తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వకపోతే పెళ్లిళ్లు చేసుకొని జీవించాలి తప్ప ఇలాంటి సంబంధాల జోలికి వెళ్లకూడదన్నారు. చదువుకున్న అమ్మాయిలు శ్రద్ధా వాకర్ హత్య కేసు నుంచి నేర్చుకోవాలని సూచించారు.

పదవి తొలగించాలని డిమాండ్ ..

కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన పూర్తి అభ్యంతరం తెలిపింది. ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్‌లో తీవ్రంగా స్పందించారు. కచౌకబారు వ్యాఖ్యలు చేసిన కౌశల్ కిషోర్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలతో నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. అలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Delhi news, National News, VIRAL NEWS