హోమ్ /వార్తలు /క్రైమ్ /

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కేంద్రం కీలక నిర్ణయం

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Kerala Gold Smuggling Case Updates: ఈ కేసు గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను విధుల నుంచి తొలగించారు.

కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)‌ను ఆదేశించింది. జాతీయ భద్రత అంశంపై స్మగ్లింగ్ వ్యవహారాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొద్దిరోజుల క్రితం యూఏఈ నుంచి వచ్చిన 30 కేజీల బంగారాన్ని తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ సీజ్ చేసింది. ఈ బంగారం విలువ రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ వ్యవహారంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మరోవైపు కేరళలో వెలుగుచూసిన గోల్డ్‌ స్మగ్లింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది.


ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలో యూఏఈ మిషన్‌ ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ కేసు గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను విధుల నుంచి తొలగించారు.

First published:

Tags: Kerala, Union Home Ministry

ఉత్తమ కథలు