మహిళను రేప్ చేసి.. ఆపై అత్యంత కిరాతకంగా చంపి.. నిజామాబాద్ లో దారుణం..

ప్రతీకాత్మక చిత్రం

మూడు రోజుల క్రితం మహిళను అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్లుగా సమాచారం. మృతదేహానికి సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు, కిరోసిన్ డబ్బా ఉండడంతో మద్యం తాగిన‌ అనంతరం.. ఆమెను అత్యాచారం చేసి.. ఆపై...

 • News18
 • Last Updated :
 • Share this:
  తరాలు మారినా మహిళల తలరాతలు మారడం లేదు. పలువురు మగ మృగాల చేతిలో మహిళలు దారుణ హత్యలకు గురవుతూనే ఉన్నారు. కాలానుగుణంగా వస్తున్న మహమ్మారులను సైతం జయిస్తున్న మహిళలు.. ఈ మాన‌వ మృగాల‌ను ఎదిరించలేక బలైపోతున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎంతటి క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చినా.. నేరగాళ్లలో మార్పు రావ‌డం లేదు. కుక్క తోక వంక‌ర అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ మ‌హిళ‌ను అతి దారుణంగా హ‌త్య చేశారు. గుర్తు తెలియని మహిళ(35) హత్యకు గురైంది. హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా.. ఆ మృతురాలి ముఖంపై కిరోషిన్ పోసి కాల్చి పడేసారు.

  ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహడ్ లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ మృతదేహం బడాపహాడ్ అడవుల్లో లభ్యమైంది. మూడు రోజుల క్రితం మహిళను అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్లుగా సమాచారం. మృతదేహానికి సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు, కిరోసిన్ డబ్బా ఉండడంతో మద్యం తాగిన‌ అనంతరం.. ఆమెను అత్యాచారం చేసి.. ఆపై హత్యచేసి ముఖం కాల్చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

  ఇదీ చదవండి.. రాచిరంపాన పెడుతున్న భార్య.. హింస తట్టుకోలేక తనను తానే చంపుకున్న భర్త.. మళ్లీ ప్రత్యక్షం.. ఎలా..?

  శుక్రవారం ఉదయం స్నానం చేయడానికి వెళ్లిన పలువురు.. మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న బోధన్ ఏసీపి రామారావు, రుద్రురు సీఐ అశోక్ రెడ్డి, తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ‌డాపాడ్ లో గదులు అద్దెకు ఇచ్చే వారిని పోలీసులు విచారించారు. మూడు రోజులుగా కొత్త వారు ఎవరెవరు వచ్చారని ఆరా తీశారు.. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందిని రప్పించి ఆధారాలు సేకరించారు.. శ‌వ ప‌రీక్ష నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోద‌న్ ఎసీపీ తెలిపారు.
  Published by:Srinivas Munigala
  First published: