కామాంధుల శాడిజం.. మృతదేహంపై అత్యాచారం.. సమాధిలో నుంచి తీసి...

సమాధిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేయడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: November 6, 2019, 8:01 PM IST
కామాంధుల శాడిజం.. మృతదేహంపై అత్యాచారం.. సమాధిలో నుంచి తీసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి ఆమెపై అత్యాచారం చేశారు కొందరు దుండగులు. పాకిస్తాన్‌లోని లోథీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ చనిపోతే.. ఆమెను గత శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత రోజు శ్మశానానికి వెళ్లిన ఆమె కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో మట్టి తవ్వేసి ఉంది. ఆమె మృతదేహం బయటపడి ఉంది. దీంతో వారికి అనుమానం వచ్చింది. ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు.

సమాధిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేయడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక కాపలాదారును ఈ విషయంపై ప్రశ్నించగా.. ఓ కుక్క వచ్చి సమాధిని తవ్విందంటూ ఏవో కథలు చెప్పబోయాడు. అయితే, సమాధి మీద అంత పెద్ద బండరాయి పెడితే.. కుక్క దాన్ని పక్కకు ఎలా జరుపుతుందని.. ఎవరో తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...