Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగిపై దోపిడీ దొంగల దాడి... పెన్షన్ల సొమ్ముతో పరారీ

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరుజిల్లాలో (Guntur District) దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నడిరోడ్డుపై గ్రామ సచివాలయ ఉగ్యోగి (Village Secretariat), వాలంటీర్ (Grama Volunteer) పై దాడి చేసి నగదు దోచుకెళ్లారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ గుంటూరుజిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారికాసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పిడుగురాళ్ల మండలం, జూలకల్లు గ్రామ సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దాదాపు రూ.20 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే జూలకల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పార్వతి, గ్రామ వాలంటీర్ వెంకటరెడ్డితో కలిసి పిడుగురాళ్ల ఆంధ్రా బ్యాంక్ నుంచి పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.19.21 లక్షలు డ్రా చేశారు. వాటిని బ్యాగ్ లో పెట్టుకొని బైక్ పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. పందిటిపల్లి కల్వర్టు వద్దకు చేరుకోగానే వారిని అడ్డుకొని క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. తొలుత వెంకట రెడ్డిని బ్యాట్ తో కొట్టడంతో అతడు స్పృహతప్పి పడిపోయాడు.

    మరోవైపు పార్వతి బ్యాగ్ తో తప్పించుకునేందుకు ప్రయత్నించగా బలవంతంగా లాక్కొని పారిపోయారు. పెవుగులాటలో ఆమకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు పార్వతితో పాటు వెంకటరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ పార్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నారు.

    దుండగులు బ్యాంక్ నుంచి ఘటనాస్థలి వరకు వారిని ఫాలో అయినట్లు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన వారు వీరి కదలికల గురించి తెలిసిన వారుగైనే అనుమానిస్తున్నారు. బ్యాంక్ తో పాటు, వారు వెళ్లిన దారిలోని సీసీ ఫుటేజ్ ను సేకరించే పనిలో పోలీసులున్నారు. దోపిడీకి సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఫిబ్రవరి 1న గ్రామంలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు నగదు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ పార్వతి తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: