Home /News /crime /

UNIDENTIFIED DEAD BODY OF YOUNG GIRL FOUND NEAR KONDAGATTU JNTU COLLEGE KRM

Mystery: జగిత్యాల జిల్లాలో యువతి మృతదేహం కలకలం... మరో షాకింగ్ విషయం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు వెళ్లే దారిలో వేసిన కంటూరు కందకాలలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
    జగిత్యాల: కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు వెళ్లే దారిలో వేసిన కంటూరు కందకాలలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు మృతదేహం ఉన్న ప్రదేశంలో బండరాయికి రక్తపు ఆనవాళ్లు కనిపించడం, యువతి గొంతుకు కూడా గాయమై ఉండటం కనిపించింది. యువతిని గుర్తు తెలియని వ్యక్తులు వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారా లేక ఇక్కడే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఘటనా స్థలంలో క్లూస్ టీం సభ్యులు కూడా పలు ఆధారాలను సేకరించారు.

    యువతిని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు ఉరివేసి చంపినట్లు ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఎర్ర చుక్కలు ఉన్న తెల్లరంగు కుర్తా, ఎర్ర రంగు పైజామా ధరించి ఉంది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని , చనిపోయిన యువతి ఎవరనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల ప్రజలను కలవరపరిచింది. మృతురాలి బంధువులను కనుగొనేందుకు యువతి మృతదేహం ఫోటోలతో పోస్టర్లు ముద్రించి విస్తృతంగా దర్యాప్తు చేసినప్పటికీ యువతి ఆనవాళ్లు బహిర్గతం కాలేదు. అంతే కాదు యువతి బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ సరికొత్త టెక్నాలజీ విధానంలోను శోధించినా కుటుంబ సభ్యుల వివరాలు లభ్యం కాలేదు. కాగా, గుర్తు తెలియని యువతి వివాహితగా గుర్తించేందుకు ఆనవాళ్లు లేనప్పటికీ .. మూడు నెలల గర్భిణీ అని ఫోరెన్సిక్ పరిశోధన రిపోర్ట్‌లో తేలినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సీఐ నాగేందర్ గౌడ్ జిల్లాలో వలస కూలీలు నివసించే ఇటుక బట్టీలు, క్రషర్‌‌లో యువతి గురించి విచారణ జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు.

    ఇది కూడా చదవండి: Karimnagar: పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యే కాళ్లపై పడిన వృద్ధురాలు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే...

    జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో యువతుల మిస్సింగ్ కేసులు కూడా నమోదు కాకపోవడంతో దర్యాప్తులో అనిశ్చితి నెలకొంది. మృతురాలు పొరుగు రాష్ట్రాలకు చెందినట్లుగా అనుమానించిన సీఐ తన సొంత ఖర్చులతో యువతి డెడ్ బాడీ ఫోటో, పోలీసు ఉన్నతాధికారుల సెల్ నంబర్లతో పోస్టర్లును ముద్రించి రాష్ట్ర సరిహద్దుల్లో అంటించారని కొందరు పోలీసులు చెప్పుకుంటున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Dead body, Jagityala, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు