• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UNHAPPY WITH WIFE USING MOBILE PHONE MAN STABS HER AND COMMIT SUICIDE SB

భార్య సెల్ ఫోన్ వాడుతుందని... భర్త ఆత్మహత్య

భార్య సెల్ ఫోన్ వాడుతుందని... భర్త ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

మూడు రోజుల ముందు, తన భర్త తనతో గొడవపడి తనను కొట్టాడని, ఆ తర్వాత తాను కాంకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది.

  • Share this:
    భార్య సెల్ ఫోన్ వాడటం మానేయమన్నాడు. తన మాట వినని భార్యకు టార్చర్ పెట్టాడు. నిత్యం వేధింపులకు గురిచేశాడు. విడుకలు ఇస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా కత్తితో భార్యపై దాడి చేసి ప్రత్యక్ష నరకం చూపాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాంకేర్  ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య సెల్ ఫోన్ వాడటం భర్తకు నచ్చలేదు. దీంతో పలుసార్లు ఆమెను వారించాడు. కత్తితో పొడిచాడు.. సెల్ ఫోన్ వాడటం మానేయకుంటే విడాకులు ఇస్తానని... బెదిరించాడు. ఆత్మహత్య కూడా చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. అ

    అయితే ఈ సంఘటనకు మూడు రోజుల ముందు, తన భర్త తనతో గొడవపడి తనను కొట్టాడని, ఆ తర్వాత తాను కాంకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది. అదే రోజు, అతను కొన్ని మందులు కూడా తీసుకున్నాడని... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని తెలిపింది. తనకు విడాకులు ఇస్తానని తన తల్లిదండ్రుల పట్ల కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకే తరచూ తనతో గొడవలకు దిగేవాడని భార్య చెబుతోంది. ప్రతీచిన్న విషయానికి తనను కొట్టేవాడని చెప్పింది. భర్తకు భయపడుతూ ప్రతిక్షనం బ్రతికేదాన్ని అని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాంకర్ పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: