రెండో కాన్పులో అమ్మాయి పుట్టిందని... నీటి తొట్టెలో పడేసి...

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. చర్ల మండలం రేగుంటలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 1, 2019, 9:39 AM IST
రెండో కాన్పులో అమ్మాయి పుట్టిందని... నీటి తొట్టెలో పడేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆడపిల్ల పుడితే ఇంట లక్ష్మీ దేవీ పుట్టిందని భావిస్తారు. కొందరైతే ఇంటిలో అమ్మాయి పుడితే... ఆనందంగా పండగ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికే ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందే కడుపులోనే కొందరు హతమారుస్తుంటే.. మరికొందరు పుట్టాక పసిప్రాణాల్ని తీసేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది.
చర్ల మండలం రేగుంటలో దారుణం జరిగింది.

నెలరోజుల పసికందును కిరాతకంగా కన్నతండ్రి పొట్టనబెట్టుకున్నాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టిందని కర్కశంతో నీటి తొట్టెలో పడేసి చంపేశాడు. మొదటి సంతానంలో ఆడపిల్ల పుట్టి రెండో సంతానంగా కూడా మళ్లీ ఆడపిల్ల పుట్టిందని తండ్రి అతి దారుణంగా హతమార్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కసాయి తండ్రి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>