Telangana: కరోనా కారణంగా పెళ్లి ఆలస్యం...బెంగతో యువతి ఆత్మహత్య

Telangana News: కరోనా, లాక్‌డౌన్ కారణంగా పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో చోటు చేసుకుంది.

news18-telugu
Updated: September 8, 2020, 7:49 AM IST
Telangana: కరోనా కారణంగా పెళ్లి ఆలస్యం...బెంగతో యువతి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా, లాక్‌డౌన్ కారణంగా పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వడిగె శిరీష(19) డిగ్రీ వరకు చదవుకున్న ఇంటి దగ్గర ఉంటోంది. కోహెడ మండలం మైసంపల్లికి చెందిన ఓ యువకుడు, శిరీష మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. వీరి వివాహాన్ని కొన్ని మాసాల క్రితమే జరిపించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే సౌదీ అరేబియాలో గొర్ల కాపరిగా పనిచేస్తున్న శిరీష తండ్రి నర్సింగం...లాక్‌డౌన్ కారణంగా విమానాలు నడవక భారత్‌కు రాలేకపోయారు.

త్వరగా పెళ్లి జరిపించాలని శిరీష తనతో పాటు ఇక్కడే ఉంటున్న తల్లిపై గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తోంది. తండ్రి వచ్చిన తర్వాత పెళ్లి జరిపిస్తామని తల్లి ఆమెను సముదాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో పది రోజుల క్రితం శిరీష పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Published by: Janardhan V
First published: September 8, 2020, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading