హోమ్ /వార్తలు /క్రైమ్ /

Flash News: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం..ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడు అరెస్ట్

Flash News: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం..ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడు అరెస్ట్

ఈడీ

ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా (Amith Arora)ను ఈడీ (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ (Amith Arora) సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా (Amith Arora) కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Delhi

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా (Amith Arora)ను ఈడీ (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్  (Amith Arora) సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా (Amith Arora) కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. కాగా అమిత్ (Amith Arora) బడ్జీ ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. ఇక సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా  (Amith Arora) 9వ నిందితునిగా ఉన్నాడు. లిక్కర్ స్కాంలో అమిత్ అరోరా (Amith Arora) ను విచారించిన ఈడీ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇక మధ్యాహ్నం అమిత్ అరోరా (Amith Arora) ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

Shocking video : శుభకార్యం జరుగుతున్న ఇంట్లో చావు మేళం .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

10 వేల పేజీలతో సీబీఐ ఛార్జ్ షీట్..

మరోవైపు ఈ కేసులో సీబీఐ 10 వేల పేజీలతో, ఈడీ 3 వేల పేజిలతో కూడిన తొలి ఛార్జ్ షీట్ ను కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో సీబీఐ ఏడుగురిపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో సహా మరికొందరి పేర్లు ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మిగతా వారు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఇక మనీష్ సిసోడియా పేరును కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. అయితే ప్రస్తుతం మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో సిబిఐ మనీష్ సిసోడియా పేరును చేర్చలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి 10 వేల పేజీలతో కూడిన తొలి ఛార్జ్ షీట్ సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ ను నేడు కోర్టు పరిశిలించనున్నట్టు తెలుస్తుంది.

3 వేల పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్..

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ (Enforcement Directorate) తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ సుమారు 3 వేలకు పైగా పేజీలతో ఉన్నట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసి 60 రోజులు అవుతున్న క్రమంలో ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. కాగా ఈ కేసులో ఇదే తొలి ఛార్జ్ షీట్. ఇక మిగతా నిందితులపై కూడా త్వరలో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు ఈడీ (Enforcement Directorate) తెలిపింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరు సమీర్ మహేంద్రు కాగా శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ గా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.

First published:

Tags: Crime news, Delhi, Delhi liquor Scam

ఉత్తమ కథలు