ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లో ఓ వివాహిత సిగ్గు విడిచి తన అత్తారింట్లో జరుగుతున్న అరాచకాన్ని బయటపెట్టింది. తాళి కట్టిన భర్త ఇంట్లో లేని సమయం చూసి మామయ్య ఆమెపై అత్యాచారానికి పాల్పడటం సహించలేకపోయింది. విషయాన్ని ఎన్నిసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగకపోవడంతో చివరకు తన మామయ్య రాక్షరూపాన్ని సెల్‌ఫోన్(Cell phone)లో రికార్డ్ చేసి డైరెక్ట్‌గా ఎస్పీ ముందు పెట్టింది. కూతురుగా భావించాల్సిన కోడలిపై కామంతో కన్నేసిన మామయ్యను పోలీసులు అరెస్ట్ (Arrest)చేశారు. అతడికి సహాకరించిన కుటుంబ సభ్యులపై కూడా పోలీస్ కేసు నమోదు చేశారు.కోడలిపై మామ అఘాయిత్యానికి పాల్పడిన వీడియో(Video)ఇప్పుడు వైరల్(Viral) అవుతోంది. అలాంటి నీచుడ్ని వదలొద్దంటూ అందరూ కోరుకున్నారు.
కోడలిపై కన్నేసిన మామ..
ఉత్తరప్రదేశ్ మీరట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత జిల్లా పోలీస్ అధికారుల్ని ఆశ్రయించింది. తనకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగిందని ..తన భర్త డ్రైవర్‌గా పని చేస్తున్నాడని..అతను డ్యూటీకి వెళ్లిన సమయంలో భర్త తండ్రి అయినటువంటి మామయ్య తనపై అత్యాచారం చేశాడంటూ కొన్ని వీడియోలను పోలీసులకు చూపించింది. బాధితురాలు చూపించిన సాక్ష్యంతో ఖంగుతిన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాధితురాలి మామయ్యను అరెస్ట్ చేశారు.
సైలెంట్‌గా వీడియో రికార్డ్ చేసిన కోడలు..
బాధితురాలి వాంగ్మూలం ప్రకారం తనకు పెళ్లిన కొద్ది రోజుల తర్వాత నుంచి మహిళకు మామ, అత్త, మరిది రూపంలో వేధింపులు ఎదురయ్యాయి. భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత కోరిక తీర్చమంటూ మామయ్య బాధితురాలిని కోరడం, అసభ్యకరమైన పనులు చేయించేవాడని బాధితురాలు పోలీసులతో మొరపెట్టుకుంది. అయితే సాక్ష్యాలు లేనందున ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులైన అత్త, మామలు ఆమెను కొట్టడం, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చారు.
కటకటాల వెనక్కు మామ..
మెట్టినింట్లో పెడుతున్న బాధలు భరించలేకపోయిన బాధితురాలు తన సెల్‌ఫోన్‌తో మామయ్య తనపై అత్యాచారానికి పాల్పడుతున్న వీడియో, అత్త తనను కొడుతున్న దృశ్యాలను సీక్రెట్‌గా రికార్డ్ చేసి జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల్ని స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేశారు. వివాహితపై అఘాయిత్యానికి పాల్పడిన మామయ్యను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video