Home /News /crime /

UNCLE RAPED MINOR GIRL IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Minor Girl: ఈ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు..! వద్దు బాబాయ్ తప్పు అన్నా వినలేదు.. కూతురులాంటి బాలికపై..,

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అన్నలా కాపడాల్సిన వారు.. తండ్రిస్థానంలో ఉండి ధైర్యం చెప్పాల్సినవారు కూడా కీచకుల్లా మారుతున్నారు. దీంతో అభం శుంభం చేయాల్సిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి.

  సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. వారికి అండగా నిలవాల్సిన వ్యక్తుల నుంచి కూడా ప్రమాదాలు పొంచిఉంటున్నాయి. అన్నలా కాపడాల్సిన వారు.. తండ్రిస్థానంలో ఉండి ధైర్యం చెప్పాల్సినవారు కూడా కీచకుల్లా మారుతున్నారు. దీంతో అభం శుంభం చేయాల్సిన వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) ఆత్రేయిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి పాసైంది. ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంటోంది. ఆమె చిన్నతాత కుమారుడు బాలికపై కన్నేశాడు. బాబాయి అయి ఉండి బాలికను తండ్రిలా చూసుకోవాల్సిన వాడు కీచకుడిలా మారాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమో స్పృహతప్పి పడిపోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు.

  మొబైల్ తో బాలికను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ క్రమంలో న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐతే ఇటీవల బాలికకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. పెళ్లి చేసుకుంటే మన మధ్య జరిగింది బయటపెడతానని ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలాగే ఈ విషయం తెలిస్తే నీ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని భయపెట్టారు. అతడి వేధింపులు భరించలేకపోయిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తసుకున్నారు..

  ఇది చదవండి: ఆన్ లైన్ రమ్మీ కోసం 6కిలోల బంగారం మాయం... వీడిది మామూలు బుర్రకాదు..


  ఇటీవల విజయనగరం జిల్లా (Vizianagaram District)లో ఓ యువకుడు అన్న అనే పదానికే మచ్చతెచ్చాడు. డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు చాలా క్లోజ్ గా ఉండేవాడు. బాలిక కూడా అన్నయ్యా అంటూ అప్యాయంగా పిలిచేది. రోజూ చెల్లెలితో సరదగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.

  ఇది చదవండి: 15 ఏళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్.., కరోనా వల్ల మళ్లీ కలిశారు.. కానీ ఇలా చేశారేంటీ..?  ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశానని ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియా (Social Media) లో పెడతానని బాలికను బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమెకు పరీక్షలు చేయగా.. ఆమె మూడు గర్భవతి అని.. అప్పటికే అబార్షన్ అయిందని తెలిపారు.

  ఇది చదవండి: ఆన్ లైన్లో పరిచయమయ్యాడు... అన్నిరకాలుగా దగ్గరయ్యాడు.. ఆ తర్వాత న్యూడ్ ఫోటోలతో...  దీనిపై బాలికను నిలదీయడంతో పెదనాన్న కుమారుడే ఈ పనిచేశాడని బాలిక బోరున విలపించింది. ఐతే బయటకు చెప్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పొద్దంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Minor girl raped, Nude videos blackmails

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు