హోమ్ /వార్తలు /క్రైమ్ /

మేనకోడలిపై అత్యాచారం.. పెళ్లైనా వదల్లేదు.. వీడియో తీసి ఆమె భర్తకే పంపించాడు..

మేనకోడలిపై అత్యాచారం.. పెళ్లైనా వదల్లేదు.. వీడియో తీసి ఆమె భర్తకే పంపించాడు..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

తనకు విడాకులు ఇస్తానని భర్త వేధిస్తున్నాడని.. దీనికంతటికీ తన మేనమామే కారణమని కంటతడిపెట్టుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మనదేశంలో మేనమామను తండ్రి తర్వాత తండ్రిలా భావిస్తారు. కానీ అతడు మాత్రం మేనకోడలు జీవితాన్ని నాశనం చేశాడు. తన పాలిట రాక్షసుడిలా మారాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేసి వీడియో తీశాడు. దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆమెకు పెళ్లైనా వదల్లేదు. నేరుగా భర్తకే వీడియో పంపించడంతో ఆ యువతి కాపురం కూలిపోయింది. హర్యానాలోని జింద్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జింధ్‌లోని జులనా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉన్నారు. ఐతే ఇటీవల వారి కాపురంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భార్య అశ్లీల వీడియోను తన మొబైల్ ఫోన్‌కి రావడంతో ఆమె భర్త ఖంగుతిన్నాడు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

Lemons stolen: నిమ్మకాయలను చోరీ చేసిన బత్తాయిలు.. కారణం ఏంటో తెలుసా?

ఇటీవల బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. 2018లో తన మేనమామ ప్రదీప్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై అత్యాచారం చేశాడని.. ఆ దారుణాన్ని వీడియో తీశాడని చెప్పింది. దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆ వీడియోను పబ్లిక్‌గా పెడతానని బెదిరిస్తున్నాడు. ఇలా కొన్నాళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులు కొనసాగించాడు. తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేదంటే వీడియోను బంధువులందరికీ పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కానీ తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఇవ్వలేదని.. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన భర్తకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. పెళ్లైనా కూడా టార్చర్ పెడుతున్నాడని.. తనకు మీరే న్యాయం చేయాలని కోరింది.

కోడలిపై మామ లైంగిక దాడికి ప్రయత్నం.. స్నేహితుడి భార్యతో మరో వ్యక్తి అలా..

తమ కాపురంలో నిప్పులు పోశాడని.. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని బాధితురాలు వాపోయింది. తనకు విడాకులు ఇస్తానని భర్త వేధిస్తున్నాడని.. దీనికంతటికీ తన మేనమామే కారణమని కంటతడిపెట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రదీప్‌పై అత్యాచారం, దోపిడీ, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్‌ ఇన్‌చార్జి గీత తెలిపారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతుదని పేర్కొన్నారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Haryana

ఉత్తమ కథలు