పనికి వెళ్లలేదని బాలుడిని కట్టేసి కొట్టిన పెదనాన్న.. నిజామాబాద్‌లో దారుణం

చిన్నపిల్లాడని కూడా చూడకుండా కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. కాలితో తన్నుతూ, చేతులతో కొడుతూ పైశాచికంగా ప్రవర్తించాడు.

news18-telugu
Updated: August 13, 2020, 6:30 AM IST
పనికి వెళ్లలేదని బాలుడిని కట్టేసి కొట్టిన పెదనాన్న.. నిజామాబాద్‌లో దారుణం
పనికి వెళ్లలేదని బాలుడిచి కట్టేసి కొట్టిన పెదనాన్న.. నిజామాబాద్‌లో దారుణం
  • Share this:
అతడు 14 ఏళ్లు బాలుడు. చదువుకుంటూ ఆడుకునే వయసు. అలాంటి బాలుడి పట్ల సొంత పెదనాన్నే అమానుషంగా ప్రవర్తించాడు. పనికి వెళ్లలేదని గొడ్డును బాదినట్లు బాదాడు. చిన్నపిల్లాడని కూడా చూడకుండా కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. కాలితో తన్నుతూ, చేతులతో కొడుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. కొట్టొద్దు అంటూ ఏడ్చినా..వదిలిపెట్టమని ప్రాధేయపడినా.. కనుకరించలేదు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మల్కాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదువును మధ్యలోనే వదిలేశాడు.

కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు కంకర సరఫరా చేసే పనిలో కూలీగా పని చేస్తున్నాడు. పనిలోకి వెళ్లకుంటే తల్లిదండ్రులు పలు మార్లు మందలించారు. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోయి, మళ్లీ ఇటీవలే తిరిగొచ్చాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లి భీమక్క వరుసకు బావ అయిన పెద్ద బాలయ్యకు వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆయన.. బాలుడిపై ప్రతాపం చూపించాడు. ఎక్కడికి వెళ్లకుండా తన దగ్గరే పనికి రావాలని బెదరించాడు. ఐనా వినకపోవడంతో బాలుడి కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి చితకబాదాడు. కొట్టొద్దు అంటూ ఎంత ఏడ్చినా వదిలిపెట్టలేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 6:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading