హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఉలిక్కిపడిన నగరం.. నడిరోడ్డుమీద భారీ టిఫిన్ బాక్స్.. బాంబేనా..? .. ఎక్కడంటే..

ఉలిక్కిపడిన నగరం.. నడిరోడ్డుమీద భారీ టిఫిన్ బాక్స్.. బాంబేనా..? .. ఎక్కడంటే..

అప్రమత్తమైన అధికారులు

అప్రమత్తమైన అధికారులు

Delhi: ఢిల్లీలో అధికారులంతా అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో టిఫిన్ బాక్స్ ను స్థానికులు కనుగొన్నారు. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఖాళీ చేయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తుంది. ఇప్పటికే ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. దీంతో అధికారులు దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని (Delhi)  రోహిణి ప్రాంతంలో టిఫిన్ బాక్స్ (Unattended Tiffin Box) ఘటన తీవ్ర కలకలంగా మారింది. రద్దీ రోడ్డు మీద టిఫిన్ బాక్స్ కన్పించింది.  దాన్ని ఎవరు కూాడా ముట్టుకొవడం లేదు. అది చాలా వెరైటీగా ఉంది.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని స్థానికులను ఖాళీ చేయించారు. బాంబు నిర్వీర్యం చేసే సిబ్బందికి సమాచారం అందించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ని కూడా రప్పించారు. ఘటనాస్థలిని సీల్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టుముట్టి ఖాళీ చేయించారు.

ఇదిలా ఉండగా గతంలో ఒక వ్యక్తి పైలేట్ అని అనేక మందిని మోసం చేశాడు.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. హేమంత్ శర్మ అనే 25 ఏళ్ల కుర్రాడు వందల మంది అమ్మాయిలకు, మహళలకు ఫేస్ బుక్ ,ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. కొందరు అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్స్ ప్ట్ చేశారు. అయితే.. అతగాడు తాను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అంతే కాకుండా విదేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నట్లు అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. కొంత మంది ఇతగాడి ట్రాప్ లో పడ్డారు. అయితే.. అతను గురుగ్రామ్ కు చెందిన యువతికి కూడా ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమె దగ్గర నుంచి 1 లక్షకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసగాడని బయటపడింది. దీంతో అతను.. వెంటనే పారిపోయాడు.

ఈ క్రమంలో.. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. నిందితుడు.. హేమంత్ ను ఢిల్లీ శివారులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, సిమ్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో ఇప్పటి దాక.. 150 మంది మహిళలకు ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. అంతే కాకుండా.. మరో 30 మందితో డేటింగ్ లో ఉన్నట్లు తెలింది. దీంతో పోలీసుల అకౌంట్ లన్నింటికి డిలీట్ చేయించారు. పైలేట్ అని చెప్పుకుంటూ.. అవతలి వారిని మోసం చేసేవాడని పోలీసుల విచారణలో తెలింది.

First published:

Tags: Crime news, Delhi, Tiffin box bomb

ఉత్తమ కథలు