రాచిరంపాన పెడుతున్న భార్య.. హింస తట్టుకోలేక తనను తానే చంపుకున్న భర్త.. మళ్లీ ప్రత్యక్షం.. ఎలా..?

ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి.. ఉపాధి దొరక్క.. నైరాశ్యంలో కూరుకుపోయిన భర్తలకు ఇంటి పోరు నుంచి ఎలా విముక్తలవ్వాలో అర్థం కావడం లేదు. బీహార్ కు చెందిన ప్రదీప్ కుమార్ రామ్ ది కూడా ఇదే కథ..

 • News18
 • Last Updated :
 • Share this:
  కరోనా కారణంగా ఉద్యోగం.. ఉపాధి కోల్పోయి మానసికంగా ఎంతో కుంగిపోయిన వారికి ఇంట్లో భార్యల పోరు ఇంకా నరకం చూపిస్తున్నది. ‘ఎన్నాళ్లని ఇంట్లో కూర్చుంటారు.. ఇళ్లు గడవొద్దా...? ఇలా అయితే ఎలా బతికేది..? పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి...’ వంటి మాటలతో బాధ్యతలు గుర్తు చేస్తున్న సతీమణులు.. అదే నోటితో కొంచెం కరుకుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కొంత మంది భర్తలను రాచి రంపాన పెడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు దొరక్క.. నైరాశ్యంలో కూరుకుపోయిన భర్తలకు ఇంటి పోరు నుంచి ఎలా విముక్తలవ్వాలో అర్థం కావడం లేదు. బీహార్ కు చెందిన ప్రదీప్ కుమార్ రామ్ ది కూడా ఇదే కథ. ఇంటిలో భార్య పెడుతున్న హింస నుంచి తప్పించుకోవడానికి తనను తానే చంపుకున్నాడు. కాదు.. కాదు.. చనిపోయానని ఆమెను నమ్మించాడు. అందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...

  బీహార్ లోని కైమూర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ రామ్.. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి ఉద్యోగాలకు జీతాల్లేవ్. అప్పట్నుంచి బళ్లన్నీ బందే ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తి తప్ప మరేదీ చేయలేని ప్రదీప్.. తొమ్మిది నెలలుగా ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో అతడి భార్యతో తరుచూ గొడవే. కొద్దిరోజులుగా ప్రదీప్ ను ఆయన భార్య టార్చర్ పెడుతున్నది. దీంతో విసిగిపోయిన ప్రదీప్... ఇక లాభం లేదనుకున్నాడు. తాను చనిపోతే గానీ విముక్తి లేదనుకున్నాడు.

  గతనెల 30న ఉదయం ప్రదీప్ భార్య లేచి.. అతడి గదిలోకి వెళ్లింది. గదిలో బెడ్ మీద రక్తం. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. రక్తపు మరకలతో ఉన్న పాదాల అడుగులు కింద పడుతున్నాయి. టీవీ పెట్టి చూస్తే.. సరిహద్దునే ఉన్న ఉత్తరప్రదేశ్ లో గుర్తు తెలియని బాడీ మృతదేహం ఉందని వార్తలు. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించారు. కేసు విచారణ ప్రారంభించారు. ఇంతలో ఆ ఇంటికి 500 మీటర్ల దూరంలో వారికి ఒక మినరల్ వాటర్ బాటిల్ దొరికింది. దానిలో మిగిలిపోయి ఉన్న రక్తం. బెడ్ మీద ఉన్న రక్తం.. ఇది ఒకటేలా అనిపించింది.

  ఇక మరుసటి రోజు.. ప్రదీప్ ను యూపీలో ఒక చోట చూశానని.. వారి పొరుగింటి వ్యక్తి పోలీసులకు చెప్పాడు. దీంతో అలర్టైన పోలీసులు.. సదరు వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెళ్లి వెతికారు. ప్రదీప్ అక్కడే కనిపించాడు. ప్రదీప్ ను అక్కడ్నుంచి తీసుకొచ్చి విచారించగా.. అతడు అసలు విషయం బయటపెట్టాడు. తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకే తాను ఇలా చేశానని అన్నాడు. డిసెంబర్ 29న ఒక మటన్ షాప్ నుంచి మేక రక్తాన్ని తీసుకొచ్చి.. అదే రోజు రాత్రి తన బెడ్ మీద పోశానని.. ఇలానైనా తాను చనిపోయానని భార్యను నమ్మించాలని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. బెడ్ మీద రక్తం పోసి వేరే చోటకు వెళ్లిపోయాననని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపారు.
  Published by:Srinivas Munigala
  First published: