హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొన్నిరోజులుగా యువతి నిద్ర పోకుండా హాస్టల్ అంతా తిరుగుతుంది.. కారణం ఏంటంటే..

కొన్నిరోజులుగా యువతి నిద్ర పోకుండా హాస్టల్ అంతా తిరుగుతుంది.. కారణం ఏంటంటే..

సూసైడ్ చేసుకున్న యువతి

సూసైడ్ చేసుకున్న యువతి

Odisha: యువతి కొన్నిరోజులుగా రాత్రిళ్లు అసలు నిద్రపోవడం లేదు. దీంతో తోటి విద్యార్థినులు ఆమెకు ఎన్నోరకాలుగా చెప్పిచూశారు. ఇక లాభంలేదని హస్టల్ సిబ్బంది.. ఇంటికి వెళ్లమని కూడా చెప్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

కొంత మంది ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ఉన్నదానికి, లేని దానికి తెగ ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు.. వారి బాధను స్నేహితులు లేదా ఇంట్లో వారితో పంచు కోరు. తమ మనసులోనే పెట్టుకుని కుమిలిపోతుంటారు. చివరకు ఏంచేయాలో అర్థం కాక ఒంటరిగా ఉంటూ పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. మనకు ఎంత పెద్ద వచ్చిన.. మంచి స్నేహితులు లేదా ఇంట్లో ఎవరో ఒకరితో పంచుకుంటే అది తగ్గిపోతుంది. ఒకవేళ్ల తెలిసిన వారితో పంచుకొవాలని లేకపోతే.. బోలేడు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చేయకుండా.. కొంత మంది మాత్రం.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు.. ఆత్మహత్యలు చేసుకొవడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని (Odisha) భువనేశ్వర్ లో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా జముకోలి వద్ద ఉన్న ఒక ప్రైవేటు హాస్టల్ లోనిన తన గదిలో ఒక యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా ఉంది. ఈ ఘటన బోలంగీర్ జిల్లాలో జరిగింది. 19 ఏళ్ల నర్సింగ్ చదివే విద్యార్థిని కొన్నిరోజులుగా సరిగ్గా నిద్ర పోవడం లేదు. ఏంకష్టమోచ్చిందో కానీ.. రాత్రిళ్లు మెల్కొనే ఉంటుంది. దీనికి పలుమార్లు సిబ్బంది ఇంటికి వెళ్లాలని చెప్పారు. అయిన కూడా ఆమె ఎవరి మాట వినలేదు. చివరకు ఆమె తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో సహాచర విద్యార్థినులు ఆమెను గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే యువతి చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. కొన్నిరోజులుగా యువతి.. చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే సూసైడ్ కు ట్రై చేస్తున్నట్లు భావిస్తున్నారు. యువతి సూసైడ్ నోట్ ఆమె ..రాసిందో లేదా మరేవరైన రాశారా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా తమిళనాడులో (Tamil nadu)  వింత చోరీజరిగింది.

తిరువళ్లూరు జిల్లాలోని కావేరి పెట్టై సమీపంలో ఉన్న వైన్ షాపులో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న వైన్ షాపులో చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి మద్యం తాగుతుంటారు. అక్కడ అనేక రకాల బ్రాండ్ లు ఉంటాయి. అయితే.. కొందరు దుండగులు దీనిపై కన్నేశారు. ఎలాగైన దీనిలో చోరీ చేయాలని స్కెచ్ వేశారు. అయితే.. వైన్ సిబ్బంది దుకాణం మూసివేసి వెళ్లగానే.. మెల్లగా గొడకు రంధ్రం వేశారు. ఆ తర్వాత.. దానిలో నుంచి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లాక.. అక్కడ ఉన్న మద్యం బాటిళ్లను చూసి మైమర్చిపోయారు. అక్కడ కూర్చుని పీకల దాక కూర్చున్నారు.

అయితే.. అర్ధరాత్రిపూట షాపులో అలజడి రావడంతో గస్తీ కాస్తున్న పోలీసులు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. దుకాణం పక్కన రంధ్రం ఉండటాన్ని చూశారు.వెంటనే దొంగలను బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు. గోడకు ఉన్న రంధ్రం నుంచి బయటకు రావడానికి దొంగలు నానా ఇబ్బందులు పడ్డారు. చివవకు ఎలాగోల బైటకు వచ్చారు. కాగా, చోరీకి పాల్పడింది.. చెన్నైకు చెందిన సతీష్, విల్లుపురానికి చెందిన మునియన్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరిని.. పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Odisha

ఉత్తమ కథలు