• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UNABLE TO OPERATE SMARTPHONE THIEF RETURNS IT TO OWNER SAYS BENGAL COPS SK

ఫోన్ కొట్టేశాడు.. కానీ వాడడం రాదు.. ఏమీ తెలియక చివరకు ఏం చేశాడంటే

ఫోన్ కొట్టేశాడు.. కానీ వాడడం రాదు.. ఏమీ తెలియక చివరకు ఏం చేశాడంటే

ప్రతీకాత్మక చిత్రం

అసలు నా ఫోన్ ఎందుకు కొట్టేశావు.. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని అడితే.. ఆసక్తికర సమాధానం చెప్పాడా యువకుడు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిందీ ఘటన.  ఓ వ్యక్తి ఇటీవల జమాల్‌పూర్‌లో ఉన్న స్వీట్ షాప్‌కు వెళ్లాడు.  మిఠాయిలు కొని బిల్లు కట్టేసి.. తిరిగి వచ్చేటప్పుడు అక్కడే ఫోన్ మరిచిపోయాడు. దాని విలువ రూ.45వేలు. ఇంటికి వచ్చి చూస్తే ఫోన్ లేదు. తిరిగి స్వీట్ షాప్‌కు వెళ్లాడు. కానీ ఫోన్ లేదు. అప్పటికే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి దాన్ని కొట్టేశాడు. ఆ నెంబర్ పలు మార్లు కాల్ చేసినా స్విచాఫ్ వచ్చింది. ఏం చేయాలో తెలియక.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాని యజమాని. ఐనా ప్రయోజనం లేకపోయింది. దాన్ని ఎవరు కొట్టేశారో తెలియలేదు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు.

    రెండు రోజుల తర్వాత మరోసారి తన మొబైల్‌కు కాల్ చేశాడు. అప్పుడు ఫోన్ రింగ్ అయింది.  అవతలి ఓ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. నీ మొబైల్ నీకు ఇచ్చేస్తాను అని సమాధానం చెప్పాడు. అసలు నా ఫోన్ ఎందుకు కొట్టేశావు.. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని అడితే.. ఆసక్తికర సమాధానం చెప్పాడా యువకుడు. ఫోన్ కొట్టేశాను గానీ.. దానిని వాడడం రావడం లేదని చెప్పాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ మొబైల్‌ను ఆపరేట్ చేయలేకపోతున్నానని.. అందుకే తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. చెప్పినట్లుగానే ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాడు. తన మొబైల్ దొరకడంతో దాని యజమాని పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు. పోలీసులు కూడా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలివేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు