(కె.వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్18 తెలుగు)
వరకట్నం అడగడమే పెద్ద నేరం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అదనపు కట్నం కావాలని భార్యను వేధింపులకు గురిచేయడం అనేది క్షమించరాని నేరం. ఇలా అదనపు కట్నం తేవాలని భర్త వేధించంగా మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డి పేట గ్రామానికి చెందిన అనుష (25) కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన బక్క కృష్ణ గౌడ్ తో రెండు సంత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయస్సున్న చిన్నారి సాన్విక ఉంది. వారం కిందట అనుష తల్లి గారింటికి వెళ్లగా.. శనివారం భర్త వెళ్లి తీసుకొచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం అందరూ తిని పడుకోగా.. అనూష తమ పడకగదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలో నుంచి పాప ఏడుపు వినిపించగా అనుమానంతో లోపలికి వెళ్లి చుడగా అనూష వేలాడుతున్న స్థతిలో కనిపించింది. వెంటనే కిందికి దించి స్థానిక అర్ఎంపీ డాక్టర్ కు చూపించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పాడు.
అనూష తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారితో పాటు బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అదనపు కట్నం కోసం తమ కూతురిని వేధించి.. ఉరివేసుకొని చనిపోయే విధంగా చీత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్ ఆరోపించారు. తనే ఉరేసుకొని చనిపోయిందని.. వరకట్న వేధింపుల వల్ల కాదని భర్త, తన అత్త పోలీసులకు చెప్పుకొచ్చారు.
పాప పుట్టిన తర్వాత అదనంగా రూ.6 లక్షల కట్నం కావాలిని భర్త, తన అత్త బాగ్యా, ఆడపడుచు, మేనమామ వేధించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dowry demand, Medak, Women suicide