Home /News /crime /

ఛీ..ఛీ.. 14 ఏళ్ల బాలుడితో రాసలీలలు.. మహిళ తీరుపై ప్రాసిక్యూటర్ ఫైర్

ఛీ..ఛీ.. 14 ఏళ్ల బాలుడితో రాసలీలలు.. మహిళ తీరుపై ప్రాసిక్యూటర్ ఫైర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

14 ఏళ్ల బాలుడిని ఆకర్షించిన ఓ మహిళ అతడితో రాసలీలలకు దిగింది. ముగ్గరు పిల్లల తల్లి అయిన మహిళ.. ఈ విధమైన చర్యకు పాల్పడటంపై యూకే కోర్టులో ప్రాసిక్యూటర్ ఫైర్ అయ్యారు.

    14 ఏళ్ల బాలుడిని ఆకర్షించిన ఓ మహిళ అతడితో రాసలీలలకు దిగింది. ముగ్గరు పిల్లల తల్లి అయిన మహిళ.. ఈ విధమైన చర్యకు పాల్పడటంపై యూకే కోర్టులో ప్రాసిక్యూటర్ ఫైర్ అయ్యారు. అయితే బాలుడితో శృంగారం చేసిన విషయాన్ని అంగీకరించిన మహిళ.. అతని వయసు మాత్రం తెలియదని బుకాయించడం కొసమెరుపు. వివరాలు.. గ్లౌసెస్టర్‌షైర్‌లో 2018 అక్టోబర్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు, తన ఫ్రెండ్‌తో కలిసి సాకర్ ఆడుతున్నాడు. అక్కడికి సమీపంలో ఉంటే 32 ఏళ్ల టీహ్ విన్సెంట్ వారు సాకర్ ఆడటం గమనించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన విన్సెంట్.. వారిని నీరు తాగేందుకు తన ఇంటిలోని ఆహ్వానించింది. అయితే వారికి నీరు ఇస్తానని పిలిచిన విన్సెంట్.. ఆ విషయాన్ని పక్కకు పెట్టి వారితో తన శరీరం గురించి మాట్లాడటం ప్రారంభించింది. అందులో ఓ బాలుడు ఆమెతో కలిసి మేడ మీదకు వెళ్లేందుకు అంగీకరించాడు. అయితే అక్కడ అతను టీవీ చూడవచ్చు అని భావించాడు. కానీ అక్కడికి వెళ్లాక విన్సెంట్ బట్టలు తీసేసి అతనితో సెక్స్ చేసింది. ఆ తర్వాత ఈ ఘటనపై బాలుడి తల్లి విన్సెంట్‌ను ప్రశ్నించింది. 14 ఏళ్ల తన కుమారుడితో మీరు సెక్స్ చేయడం ఏమిటి అంటూ నిలదీసింది.

    ఈ ఘటనకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్ క్రిస్టోఫర్ స్మిత్ తన వాదనలు వినిపించారు. విన్సెంట్ ప్రవర్తను తప్పుబట్టారు. ఆ చర్య సరైనది కాదని బాలుడు గట్టిగా అనుకున్నాడని చెప్పారు. బాలుడి వయసు దృష్ట్యా అతని వివరాలు వెల్లడించడం కుదరదని ప్రాసిక్యూటర్ క్రిస్టోఫర్ స్మిత్ కోర్టుకు వివరించారు. అతడు స్కూల్‌లో చదువుతున్నాడని చెప్పారు. బాలుడి వయసు కంటే మహిళ వయసు రెండు రేట్లు ఎక్కువ అని చెప్పాడు. దాదాపు 5 నిమిషాల పాటు ఆమె బాలుడితో సెక్స్ చేసిందని.. ఇది భరించలేని బాలుడు ఆమెను నెట్టివేసి దుస్తులు ధరించి మెట్లమీద నుంచి పారిపోయాడని తెలిపాడు.

    విన్సెంట్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని కోర్టుకు తెలిపింది. "నేను అతనితో సెక్స్ చేయలేదని చెప్పడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం ముందు వరకు నేను అతన్ని ఎప్పుడు చూసింది లేదు. కానీ అతడి ఫ్రెండ్‌కు మాత్రం 21 ఏళ్లు. అయితే నేను అతడిని బలవంతం కూడా చేయలేదు. అతను కూడా సెక్స్ చేసినందుకు హ్యాపిగా ఫీలయ్యాడు. అయితే బాలుడు ఆ సమయంలో అతడికి16 ఏళ్లు(యూకే సెక్స్‌లో పాల్గొనేందుకు చట్టబద్దమైన వయసు) అని చెప్పాడు. అప్పుడే అతడు తనకు 14 ఏళ్లు అని చెప్పి ఉంటే నేను ఈ రోజు కోర్టు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు"అని చెప్పింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Uk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు