Home /News /crime /

UDAIPUR MURDER CASE UPDATES ACCUSED MAY BOOKED UNDER UAPA NIA TO TAKE OVER CASE SEC 144 IMPOSED ACROSS RAJASTHAN FOR A MONTH MKS

Udaipur Murder : ఉదయ్‌పూర్‌ హత్య ఉగ్రవాద చర్యే! -రంగంలోకి ఎన్ఐఏ -రాజస్థాన్ ‌అంతటా 144 సెక్షన్

ఉదయ్‌పూర్‌ హతుడు కన్హయ్య లాల్, హంతకుడు రియాజ్

ఉదయ్‌పూర్‌ హతుడు కన్హయ్య లాల్, హంతకుడు రియాజ్

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ హత్య కేసును ఉగ్రవాద చర్యగా పరిగణించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద కేసులు పెట్టే అవకాశాలున్నాయి. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతుల్లోకి తీసుకోనుంది. వివరాలివే..

ఇంకా చదవండి ...
ఇండియాలో దాదాపు తొలిసారి ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల తరహాలో వ్యక్తిని పీక కోసి హతమార్చిన ఉదయ్‌పూర్‌ ఘటన (Udaipur Murder case) సర్వత్రా సంచలనం రేపింది. రాజస్థాన్ (Rajasthan)లో ప్రఖ్యాత పర్యాటక సిటీ ఉదయ్‌పూర్‌ (Udaipur)లో పట్టపగలు చోటుచేసుకున్న కిరాతక కాండలో కన్హయ్య లాల్ అనే టైలర్ (Udaipur Tailor Kanhaiya Lal)ను ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా చంపేశారు. నిందితులను మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌, మహమ్మద్‌ ఘోష్‌గా గుర్తించారు. ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దుస్తుల కొలతలు ఇవ్వడానికొచ్చిన కస్టమర్ల రూపంలో షాపులోకి ప్రవేశించిన దుండగుల్లో రియాజ్ కత్తితో కన్హయ్య పీక కోస్తుంటే, అక్తర్ ఆ దారుణాన్ని వీడియో తీశాడు. పీక కోసిన వీడియోతోపాటు ఈ పని చేసింది తామేనంటూ మరో వీడియోను రూపొందించి, రెండిటినీ వాళ్లే వైరల్ చేశారు. ఈ ఘటనతో ఉదయ్‌పూర్‌ సిటీ భగ్గుమంది. రాజస్థాన్ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది..

Petrol Diesel Prices : పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు? -జీఎస్‌టీ కౌన్సిల్ భేటీపై ఉత్కంఠ


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకున్న హత్యాకాండ దేశవ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. మహ్మద్‌ ప్రవక్తపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు మద్దతుగా పది రోజుల క్రితం ఉదయ్‌పూర్‌ టైలర్ కన్హయ్యాలాల్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టాడు. ముస్లిం వర్గీయులుతో వాదన, బెదిరింపుల తర్వాత అతను కొద్దిరోజులు అజ్ఞాతంలో గడిపి మళ్లీ టైలర్ షాపులో పని మొదలు పెట్టాడు. పథకం ప్రకారమే కన్హయ్యను అంతం చేసినట్లు వీడియో స్టేట్మెంట్ల ద్వారా అర్థమవుతోందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Rythu Bandhu : ఇవాళ్టి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. కొత్తగా 3.64 లక్షల మందికి రైతుబంధు


ఉదయ్‌పూర్‌ హత్య కేసును ఉగ్రవాద చర్యగా పరిగణించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద కేసులు పెట్టే అవకాశాలున్నాయి. అంతేకాదు, నుపుర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చిన నేపథ్యం, దాని కొనసాగింపుగా తాజా నరికివేత ఘటన జరగడంతో ఉదయ్‌పూర్‌ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేతుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.

CM KCR | Governor : తమిళిసైతో కేసీఆర్ తేనీటి విందు.. టీఆర్ఎస్ చీఫ్ టార్గెట్ మార్చుకున్నారా?


ఈ ఘటనకు ఐసిస్‌ ఉగ్రవాదకు సంస్థకు లేదా పాక్‌ ఉగ్రవాద సంస్థకు లింకులున్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవుతుండటం ఎన్ఐఏ రాకను మరింత బలపరుస్తున్నాయి. ఉదయ్‌పూర్‌ కాండకు దారి తీసిన పరిణామాలు, తర్వాతి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తే బాగుంటుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పడాన్ని బట్టి కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్‌ఐఏకు చెందిన ఓ బృందం ఉదయ్‌పూర్‌కు వెళ్లినట్లు సమాచారం.

TRS | BJP : బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్.. జాతీయ భేటీ, మోదీ సభ వేళ ఎటుచూసినా కేసీఆర్!


ఉదయ్‌పూర్‌ లో టైలర్ కన్హయ్యలాల్ హత్యోదంతం రాజస్థాన్ వ్యాప్తంగా ఉద్రిక్తలను పెంచింది. అప్రమత్తమైన ప్రభుత్వం తొలుత ఉదయ్‌పూర్‌ లో కర్ఫ్యూ విధించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమలుకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు రాజస్థాన్ అంతటా 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయ్‌పూర్‌ అంతటా దాదాపు 600 మంది పోలీసులను మోహరించారు. ఉదయ్‌పూర్‌ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. ఉదయ్‌పూర్‌ హత్యాకాండను పార్టీలకు అతీతంగా నేతలందరూ ఖండించారు. కన్హయ్యా లాల్‌ హత్యను ముస్లిం సంస్థ జమాతే హింద్‌ సైతం తీవ్రంగా ఖండించింది. టైలర్ హంతకులను కఠినంగా శిక్షించడంతోపాటు అసలీ వివాదానికి కారణమైన నూపుర్‌ శర్మనూ అరెస్టు చేయాలని జమాతే హింద్ డిమాండ్ చేసింది.ప్రధాని మోదీకీ బెదిరింపు : కన్హయ్య లాల్ హత్య ఘటన తర్వాత నిందితులను మహమ్మద్‌ రియాజ్‌ అక్తర్‌, మహమ్మద్‌ ఘోష్‌ మూడు వీడియోలను స్వయంగా విడుదల చేశారు. మొదటిది హత్య తాలూకు వీడియోకాగా, రెండోది హత్యను చేసినట్లుగా అంగీకరిస్తున్న వీడియోతో పాటు ఈనెల 17న చిత్రీకరించినట్లుగా భావిస్తోన్న మూడో వీడియోనూ విడుదల చేశారు. రెండో వీడియోలో ఆ ఇద్దరూ తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రధాని మోదీని వదిలిపెట్టబోమని, తప్పు చేస్తే తల తెగిపడుతుందని హెచ్చరించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Murder case, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు