హైదరాబాద్‌లో దారుణం.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను చితక్కొట్టి..

Uber Driver Stabbed: రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన డ్రైవర్.. వారిని పికప్ చేసుకోవడానికి కోఠి బస్ స్టాప్‌కు చేరుకొని వారిద్దర్ని ఎక్కించుకున్నాడు.. గమ్య స్థానం చేరుకోగానే, వారిలో ఒక వ్యక్తి వేరో వ్యక్తికి ఫోన్ చేశాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 9:43 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ను చితక్కొట్టి..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 9:43 AM IST
అది జూన్ 8 రాత్రి సమయం.. ఇద్దరు వ్యక్తులు ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు.. హైదరాబాద్‌లోని కోఠి నుంచి సంఘీ టెంపుల్ వరకు వెళ్లాలని అందులో నమోదు చేశారు.. రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన డ్రైవర్.. వారిని పికప్ చేసుకోవడానికి కోఠి బస్ స్టాప్‌కు చేరుకొని వారిద్దర్ని ఎక్కించుకున్నాడు.. గమ్య స్థానం చేరుకోగానే, వారిలో ఒక వ్యక్తి వేరో వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ కలవలేదు. తాము కలవాలనుకున్న వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని, మమ్మల్ని మళ్లీ కోఠిలో దించాలని అన్నారు. అందుకు సరేనన్న డ్రైవర్ బాలరాజు.. వారిద్దర్ని కోఠి వైపు తీసుకొస్తుండగా.. ఔటర్ రింగు రోడ్డు వద్దకు చేరుకోగానే వారిలో ఒక వ్యక్తి బాలరాజు తలపై పిడిగుద్దులు కురిపించాడు, మెడను గాయపరిచారు. ఇంతలో కారు ఆపగానే వారు కారు దిగి పారిపోయారు.

అటుగా వచ్చిన స్థానికులు డ్రైవర్ రక్తపు గాయాలతో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో ఆస్పత్రిలో చేరిన బాలరాజు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే, దాడి చేసిందెవరన్నది తెలియరాలేదు. బాధితుడికి వారు ఇంతకుముందే ఏమైనా తెలుసా అని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...