• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • UBER DRIVER ROBS CUSTOMER HOUSE AFTER DROPPING AT AIRPORT IN CALIFORNIA CR

కస్టమర్‌ను ఎయిర్‌పోర్టులో దింపి... ఇంటికెళ్లి దోచేసిన ఉబెర్ డ్రైవర్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో దింపి, వారి ఇంటికెళ్లి మొత్తం దోచేశాడు ఓ ట్యాక్సీ డ్రైవర్... కాలిఫోర్నియాలో వెలుగుచూసిన విచిత్ర సంఘటన....

  • Share this:
గోపిచంద్ హీరోగా నటించిన ‘ఆంధ్రుడు’ సినిమా చూశారా... ఆ సినిమాలో భార్యాభర్తలను రైల్వేస్టేషన్‌లో దింపి, ఆ తర్వాత వారి ఇంటికే వెళ్లి మొత్తం దోచేస్తాడు ఆటోడ్రైవర్. ఆటో ప్రయాణంలో భార్యాభర్తల సంభాషణలు మొత్తం పక్కాగా స్కెచ్ వేసుకుని చోరీకి వెళతాడు. అచ్ఛం అదే సినిమాలాగే ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో దింపి, వారి ఇంటికెళ్లి మొత్తం దోచేశాడు ఓ ట్యాక్సీ డ్రైవర్. అయితే ఈ సంఘటన జరిగింది మనదగ్గర కాదు. కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న ఓ జంట... విదేశాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఉబెర్ యాప్‌లో ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. వారి రిసీవ్ చేసుకుని, ఎయిర్‌పోర్టులో దింపిన డ్రైవర్ జాకీ గోర్డాన్ విల్సన్... మళ్లీ తిరిగి వారి ఇంటికి వెళ్లాడు. చోరీ చేయాలని ఫిక్స్ అయిపోయి, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించాడు. తర్వాత లోపలికి ప్రవేశించి, దొరికినకాడికి దోచేశాడు. తర్వాత అక్కడి నుంచి ఎంచక్కా జారుకున్నాడు. పక్కింట్లో ఇంట్లో దొంగతనం జరిగిన విషయం గ్రహించిన స్థానికులు... వెంటనే ఇంటి యజమానులు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో హుటాహుటీన ఇంటికి తిరిగొచ్చిన వారు... అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో కనిపించిన వ్యక్తి... ఉబెర్ డ్రైవర్ అని గుర్తించిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉబెర్ యాప్ ద్వారా డ్రైవర్ వివరాలు సేకరించిన పోలీసులు... అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు దంపతులు, డ్రైవర్ మీద యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అతన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది ఉబెర్ సంస్థ. ఇటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది ఉబెర్.

First published: